Satya Dev Birthday: Krishnamma First Look Released Deets Inside - Sakshi
Sakshi News home page

Happy Birthday Satya Dev: సత్యదేవ్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్‌ రిలీజ్‌..

Published Mon, Jul 4 2022 12:15 PM | Last Updated on Mon, Jul 4 2022 12:50 PM

Satya Dev Krishnamma First Look Release On His Birthday - Sakshi

Satya Dev Krishnamma First Look Release On His Birthday: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. కాగా సోమవారం (జూలై 4) సత్యదేవ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. 

దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. సత్యదేవ్‌తోపాటు లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె నటించిన ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు.

చదవండి: హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్‌ నిలిపివేత..
కమల్‌ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ?
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement