Satya Dev About His Bitter Experience In Afghanistan Airport - Sakshi
Sakshi News home page

Satya Dev : 'చిరంజీవి అంటే పిచ్చి..  నా నుదిటిపై ఆ గాయం ఎలా జరిగిందంటే'

Published Fri, Dec 9 2022 2:58 PM | Last Updated on Fri, Dec 9 2022 3:57 PM

Satya Dev About His Bitter Experience In Afghanistan Airport - Sakshi

టాలీవుడ్‌లో వర్సలైట్‌ యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్‌. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె 'గాడ్‌ఫాదర్‌' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్‌ తాజాగా 'గుర్తాందా శీతాకాలం' సినిమాలో తమన్నాతో కలిసి నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్‌ పలు విశేషాలను పంచుకున్నాడు.

చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే తనకు పిచ్చి ఇష్టమని, ఓరోజు కొదమసింహంలోని ఓ ఫైట్‌ ఇంట్లో ప్రాక్టీస్‌ చేస్తుంటే నుదిటిపై దెబ్బతగిలి ఆ మచ్చ అలాగే ఉండిపోయిందని తెలిపాడు. ఇక గాడ్‌ఫాదర్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఓరోజు చిరంజీవి తనను ఇంటికి ఆహ్వానించడంతో జీవితం ధన్యమైపోయిందని పేర్కొన్నాడు. ఇక సినిమా షూటింగ్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు.. 'ఎయిర్‌పోర్టులో నన్ను సూసైడ్‌ బాంబర్‌ అనుకొని అరెస్ట్‌ చేశారు.

సాధారణంగా సూసైడ్‌ బాంబర్స్‌ ట్రిగర్‌ కాలి దగ్గర ఉంచుకుంటారట. ఈ విషయం నాకు తెలియదు. ఎయిర్‌పోర్టులో నా పక్కన కూర్చున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ని కాలి దగ్గర పెట్టుకున్నాడు. అది తీయడానికి ప్రయత్నిస్తుంటే, అతడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. పక్కన నేను ఉండేసరికి నన్ను కూడా సూసైడ్‌ బాంబర్‌ అనుకొని అరెస్ట్‌ చేశారు' అంటూ  చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement