శ్రీనివాస్‌రెడ్డితో మరో సినిమా తీస్తా | Ragala 24 gantallo movie details | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌రెడ్డితో మరో సినిమా తీస్తా

Published Sun, Jul 7 2019 12:29 AM | Last Updated on Sun, Jul 7 2019 12:29 AM

Ragala 24 gantallo movie details - Sakshi

శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ కానూరు

కథానాయిక ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్‌ హీరోగా నటించారు. శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో శ్రీనివాస్‌ కానూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘స్వతహాగా వ్యాపారవేత్తను అయిన నేను సినిమా నిర్మాణం ఎంత కష్టమో, ఎంత కష్టపడతారో కళ్లారా చూశాను. నిర్మాతగా నా తొలి సినిమాని శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో నిర్మించడం సంతోషంగా ఉంది. అనుకున్న బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాం. సెప్టెంబర్‌ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నాం.

నా నెక్ట్స్‌ సినిమా కూడా శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని అన్నారు. ‘‘కొంత గ్యాప్‌ తర్వాత మంచి కంటెంట్‌ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగే అద్భుతమైన థ్రిల్లర్‌ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత ఈషా రెబ్బా పెద్ద హీరోయిన్ల జాబితాలోకి వెళుతుంది. సత్యదేవ్‌ హీరోగా బిజీ అవుతారు. హాస్యనటుడు కృష్ణభగవాన్‌ ఈ సినిమాకు మాటలు రాయడం అదనపు ఆకర్షణ’’ అని శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ముస్కాన్‌ సే«థీ, గణేష్‌ వెంకట్రామన్, కృష్ణభగవాన్, అనురాగ్, ‘టెంపర్‌’ వంశీ, రవి ప్రకాష్, రవి వర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆలీబాబా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement