హలో బాలీవుడ్‌ | Eesha Rebba Bollywood Entry | Sakshi
Sakshi News home page

హలో బాలీవుడ్‌

Published Mon, Jan 20 2020 12:43 AM | Last Updated on Mon, Jan 20 2020 12:43 AM

Eesha Rebba Bollywood Entry - Sakshi

ఈషా రెబ్బా

తెలుగమ్మాయి ఈషా రెబ్బా త్వరలోనే బాలీవుడ్‌కు హాయ్‌ చెప్పనున్నారని తెలిసింది. ఓ హిందీ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేశారట ఈషా. అనిల్‌ కపూర్‌ తనయుడు, సోనమ్‌ కపూర్‌ సోదరుడు హర్షవర్థన్‌ కపూర్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందట. జాతీయ అవార్డు గ్రహీత రాజ్‌ సింగ్‌ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఆడిషన్స్‌ తర్వాత ఈషాను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో రాజస్థానీ అమ్మాయి పాత్రలో ఆమె నటించనున్నారు. ఈషా పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement