వాస్తవ ఘటనల స్ఫూర్తితో సత్యదేవ్‌ సినిమా.. విడుదలపై ప్రకటన | Satyadev Zebra Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనల స్ఫూర్తితో సత్యదేవ్‌ సినిమా.. విడుదలపై ప్రకటన

Published Tue, Sep 17 2024 1:09 PM | Last Updated on Tue, Sep 17 2024 1:21 PM

Satyadev Zebra Movie Release Date Locked

సత్యదేవ్‌ , డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘జీబ్రా’ . లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌.. అన్నది ఉపశీర్షిక. క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల మోషన్‌ పోస్టర్‌ను వీడియో ద్వారా విడుదల చేశారు మేకర్స్‌. అక్టోబర్‌ 31న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. సత్యదేవ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల కానుంది  ఈ సినిమాకు సంగీతం రవి బస్రూర్ అందించారు.  ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌. పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలుగా ఉన్నారు. సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ , జెన్నిఫర్‌ కథానాయికలుగా నటిస్తుండగా సునీల్,సత్య కీలకపాత్రలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement