Ravi Basrur
-
ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన చిత్రం 'మార్కో'. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ. 85 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.'వయొలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం జనవరి 1న తెలుగులో విడుదల కానుంది. మార్కో సినిమా తెలుగు హక్కులు ఏకంగా రూ.3 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. టైటిల్ రోల్లో ఉన్ని ముకుందన్ అద్భుతంగా నటించారు. అతను మలయాళ నటుడే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడే కావడం విశేషం. టాలీవుడ్లో జనతా గ్యారేజ్, భాగమతి, యశోదా వంటి చిత్రాల్లో నటించారు. భాగమతిలో అనుష్కకు జోడీగా ఆయన నటించిన విషయం తెలిసిందే. ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ అంటూ మార్కోపై పలు కథనాలు కూడా వచ్చాయి. యానిమల్, కిల్ వంటి చిత్రాలను మించిన వైలెంట్ ఇందులో ఉందంటూ పలువురు నెటిజన్లు కూడా పేర్కొన్నారు. అందువల్ల మార్కో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రధారులుగా మెప్పించారు. -
సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల
సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జీబ్రా’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
వాస్తవ ఘటనల స్ఫూర్తితో సత్యదేవ్ సినిమా.. విడుదలపై ప్రకటన
సత్యదేవ్ , డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘జీబ్రా’ . లక్ ఫేవర్స్ ది బ్రేవ్.. అన్నది ఉపశీర్షిక. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల మోషన్ పోస్టర్‌ను వీడియో ద్వారా విడుదల చేశారు మేకర్స్. అక్టోబర్ 31న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. సత్యదేవ్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల కానుంది ఈ సినిమాకు సంగీతం రవి బస్రూర్ అందించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఉన్నారు. సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ , జెన్నిఫర్ కథానాయికలుగా నటిస్తుండగా సునీల్,సత్య కీలకపాత్రలో కనిపించనున్నారు. -
లీక్ చేసిన సలార్ మ్యూజిక్ డైరెక్టర్
-
'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్
ఎన్టీఆర్ (NTR)పై అభిమానాన్ని చాటుకున్నారు సంగీత దర్శకుడు రవి బస్రూర్ (Ravi Basrur). ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ ఎన్టీఆర్‌పై ప్రత్యేక పాటను రూపొందించారు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రవి బస్రూర్ స్టూడియోను సందర్శించారు. తన స్టూడియోకు ఎన్టీఆర్ వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్‌ను కానుకగా ఇచ్చారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్- రవి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. 'వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం' అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంది. అలా తారక్‌పై తనకున్న అభిమానాన్ని రవి బస్రూర్ చాటుకున్నాడు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పు ఎన్టీఆర్-నీల్ సినిమాకు రవి బస్రూర్ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్ అని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.. పాన్ ఇండియా రేంజ్లో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దేవర రన్‌టైమ్'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో విడుదల కానున్న సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీగా రెస్పాన్స్ వస్తుంది. సప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేవర సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. దేవర్ రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా ఉంది. -
‘భీమా’ మూవీ రివ్యూ.. 'గోపీచంద్' హిట్ కొట్టాడా..?
టైటిల్: భీమా నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్,మాళవిక శర్మ,నాజర్,వెన్నెల కిషోర్,నరేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాత: కేకే రాధామోహన్ దర్శకత్వం: ఏ. హర్ష సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ సంగీతం: రవి బస్రుర్ విడుదల తేది: మార్చి 8, 2024 భీమా కథేంటంటే సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభం అవుతుంది. ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంది. కేరళలోని మహేంద్రగిరిలో సినిమా కథ మొదలౌతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడి ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తి భవాని (ముఖేష్ తివారి) గడగడలాడించే స్థాయిలో ఉంటాడు. పెట్రోల్ ట్యాంకర్స్ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తి భవాని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరో వైపు భీమా కథలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరులో గత యాభైఏళ్లుగా మూత పడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవాని. సరిగ్గా అలాంటి సమయంలో ఎస్సైగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు భీమా (గోపీచంద్)... ఈ క్రమంలోనే విద్య (మాళవికా శర్మ) ఎంట్రీ ఇస్తుంది. విద్య ఒక స్కూల్లో పనిచేస్తూనే మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా రవీంద్రవర్మ (నాజర్) ఉంటారు. ఆయన దగ్గర విద్య మొక్కలపై పలు పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ రవీంద్రవర్మ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే.. శక్తి భవాని ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తుంటాడు రవీంద్రవర్మ.. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ కథలో పెట్రోలు ట్యాంకర్స్ మాటున భవాని చేస్తున్న అక్రమ వ్యాపారం ఏంటి..? భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..? విలన్లను ఎదుర్కొనే క్రమంలో భీమా ఏం అయ్యాడు..? ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన తన తమ్ముడు రామా (గోపీచంద్) కథలోకి ఎలా వచ్చాడు..? పరశురామ క్షేత్రంలో ఉన్న శివాలయం 50 ఏళ్లుగా ఎందుకు మూత పడింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపు అందరిలో కలుగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే 'భీమా' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా ప్రారంభంలోనే పరశురాముడి గురించి చెప్పడం.. ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని అనుకుంటాం కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లోనే తెలిపోతుంది. అక్కడ నుంచి రోటీన్ కమర్షియల్ స్టోరీతో సినిమా జరుగుతుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా సినిమాల్లో కనిపించిందే ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష కొంత సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయాడు. సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్‌ను చివరి వరకు ఎక్కడా ప్రస్థావన ఉండదు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి.. ఎందుకంటే గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.. ఆపై గుడి కాన్సెప్ట్ ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమాలో అది కాస్తా మైనస్‌గా మారింది. కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్‌ను చేర్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్, మాళవికా శర్మ మధ్య ఉండే లవ్ ట్రాక్ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. కన్నడ చిత్ర సీమలో కొరియోగ్రాఫర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన ఏ. హర్ష శివరాజ్‌కుమార్‌తో 'వేదా' చిత్రాన్ని తీసి తెలుగు వారికి దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్‌తో భీమా సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు.. రెండు పాత్రలలో ఆయన ఇరగదీశాడు.. సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్‌తో నడిపించాడు. సినిమా స్టోరీ అంతా కూడా ఫాంటసీ ఎలిమెంట్‌తో డైరెక్టర్ తెరకెక్కించి ఉండుంటే భారీ హిట్ కొట్టేది అని చెప్పవచ్చు. ఎవరెలా చేశారంటే.. భీమాగా పోలీసు గెటప్‌లో కనిపించిన గోపీచంద్.. రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లలో ఇరగదీశాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ ఆయన చక్కగా నటించాడు. ఇక సినిమాలో గోపీచంద్ తర్వాత నాజర్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్ మాళవికా శర్మ,ప్రియా భవానీ శంకర్ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్ ఉన్నంత సేపు ప్రేక్షకులో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ అందరినీ కట్టిపడేస్తుంది. విలన్‌గా నటించిన శక్తి భవానీని డైరెక్టర్ అంతగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్,నరేష్, పూర్ణ,నాజర్ వంటి స్టార్స్ వారి పరిధిమేరకు మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన అందించిన బీజీఎమ్ సినిమాపై పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. పాటలు అంతగా నోటెడ్ కాకపోయినప్పటికీ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చివరిలో 30 నిమిషాల పాటు దర్శకుడి చూపిన పని తీరుకు ఎక్కువ మార్కులు పడుతాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్ డెస్క్ -
రవి బస్రూర్ పేరు వెనుక కన్నీళ్లు తెప్పించే స్టోరీ
పాన్ ఇండియా రేంజ్లో రవి బస్రూర్ పేరు కేజీఎఫ్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ 'సలార్' సినిమాతో మళ్లీ దేశవ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమా బాలీవుడ్లో కూడా సూపర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఇందులో రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు మాత్రమే కాదు, మాస్ సినిమాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని కూడా ఆయన అందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా తమ సినిమాల కోసం రవి బస్రూర్ హంటింగ్ బీజీఎమ్ కోసం తహతహలాడుతున్నారు. ఆకలితో జీవనం.. రవి బస్రూర్ నేపథ్యం రవి బస్రూర్ తండ్రి గ్రామంలో కొలిమి నడుపుతున్నాడు. రవి కూడా తండ్రి దగ్గర కొలిమి పని చేస్తూ ఉండేవాడు. కానీ సంగీత రంగంలో ఏదైనా సాధించాలనే అచంచలమైన సంకల్పం అప్పటికే అతనిలో ఉండేది. కానీ ఆర్థిక స్థోమత అడ్డొచ్చి చాలా రోజుల పాటు తండ్రి వద్దే పని చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం గొప్ప సంగీత దర్శకుడిగా అయిన తర్వాత తాజాగా కన్నడ సరిగమప సీజన్ 10కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.ఆ సమయంలో తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు. సరిగమప షోలో రవి బస్రూర్ తన జీవితాన్ని మార్చేసిన సంఘటనను వివరించాడు. 'సంగీత ప్రపంచంలో తానేంటో నిరూపించుకోవాలని ఇంటి నుంచి వచ్చేశాను. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.. అప్పటికే మూడు నాలుగు రోజులు భోజనం చేయలేదు.. నీళ్లు తాగుతూనే గడిపేశాను... కానీ నా జేబులో ఒక లిస్ట్ ఉంది.. ఏ రోజు ఏ గుడిలో ఎలాంటి ప్రసాదం ఇస్తారో రాసి పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను సమయానికి వెళ్ళలేదు, నాకు ప్రసాదం లభించదు.' అని ఆ రోజు సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 'దేవుడా, నా పరిస్థితి ఏమిటి..? అని నా మదిలో చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. అప్పుడు ఒక పెద్దాయన నన్ను చూశాడు. అతని పేరు కామత్. నన్ను బెంగళూరులోని ఎవెన్యూ రోడ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నన్ను ఒక దుకాణానికి తీసుకెళ్లి ఇతను ఇత్తడి, బంగారు వస్తువుల తయారి వంటి అన్ని పనులు చేస్తాడని యజమానికి పరిచయం చేశాడు .కానీ ఇతనికి సంగీతం అంటే పిచ్చి. ఎప్పుడూ చూడే అదే పనిలో ఉంటాడని తెలిపాడు. పనిలో పెట్టుకోమని కామత్ చెప్పడం.. వెంటనే అతను ఓకే చేయడం జరిగిపోయాయి. అతను ముందే చెప్పాడు.. నేను ఈ రేంజ్లో ఉంటానని కానీ నేను ఎలాంటి పని చేయనని చెప్పాను.. అప్పుడు అక్కడ ఉన్న యజమాని నాకు రూ. 5 ఇచ్చి ఏదైనా తిని రమ్మన్నాడు. అప్పుడు నన్ను చూసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని చెప్పాడు. భవిష్యత్‌లో అతన్ని చూడటానికి 5 నెలలు అపాయింట్మెంట్ కావాలి. అంతలా అతని రేంజ్ పెరిగిపోతుందని చెప్పాడు. కానీ ఆయన మాటలు నాకు నమ్మకంగా లేవు.. ఇలా చెప్పేవాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. నాకు సంగీతం మాత్రమే కావాలని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి మీకు ఏమి కావాలి అని అడిగాడు, నాకు కీబోర్డ్ కావాలి, నాకు డబ్బు ఇస్తావా అని చెప్పాను, అతను ఎంత కావాలి అని అడిగాడు. నేను. 35 వేలు అన్నాను. క్షణం ఆలోచించకుండా వెంటనే ఇచ్చాడు.. ఆయనెవరో నాకు తెలియదు.. ఆ సమయంలో నేను, కామత్ ఇద్దరం షాక్ అయ్యాము. ఈ డబ్బు తిరిగివ్వకు. కీబోర్డ్ తీసుకో.ఈ 35వేలకు పని ఇస్తాను, పని చేసి చెల్లించు అని చెప్పాడు. ఆ సాయం చేసిన వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు తొలగించి అతని పేరును నా ఊరు పేరుతో పాటు ఉంచాను. అలా రవి బస్రూర్ వెలుగులోకి వచ్చింది. నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అతనే.. అతనికి క్రెడిట్ ఇవ్వడానికే నా పేరును మార్చుకున్నాను. నా అసలు పేరు కిరణ్.. కానీ రవి బస్రూర్ అని పిలుస్తేనే నాకు సంతోషం.' అని ఆయన చెప్పాడు. -
Bhimaa Teaser: వేటాడేందుకు బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు
టాలీవుడ్ మ్యాచోస్టార్ గోపీచంద్ 'భీమా'గా బాక్సాఫీస్ బరిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. టీజర్లో ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. గోపీచంద్ ఒక ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు. వినూత్నమైన యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీ కెరియర్లో 31వ చిత్రంగా భీమా తెరకెక్కుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 16న భీమా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనువైట్ల డైరెక్షన్లో తన 32 వ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. -
'సౌండ్ ఆఫ్ సలార్'.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ 'సలార్' సినిమా గురించే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలోని పాటలు ఉండేది తక్కువే అయినా బీజీఎం ప్రధాన బలంగా పనిచేసింది. సినిమా విడుదలకు ముందురోజు ఒక పాటను విడుదల చేశారు. 'ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు. అణచగనే పుడతాడు రాజే ఒకడు.. శత్రువునే కడ తేర్చే పనిలో మన రాజు.. హింసలనే మరిగాడు.. మంచిని మరిచే...' అంటూ వచ్చిన ఈ సాంగ్ చాలా హిట్ అయింది. ఈ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్ పట్ల సలార్ టీమ్ కూడా ఆనందపడుతుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ తాజాగా 'సౌండ్ ఆఫ్ సలార్' పేరుతో వీడియోను విడుదల చేసింది. రవి బస్రూర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ అద్భుతమైన సౌండ్ ట్రాక్‌కు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
ఆ సినిమాకు రీమేక్‌నే సలార్.. మ్యూజిక్ డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్’. ‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే ‘పొగరు’ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ సినిమా డిసెంబంర్ 22న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌండ్ బోట్ బ్యూటీ) అయితే గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు సలార్ రీమేక్ అని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సలార్ విడుదల తేదీ ప్రకటించడంతో ఇలాంటి రూమర్స్‌కు ఇక కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎన్నో నెలల క్రితం సంగీత దర్శకుడు రవి బస్రూర్ సలార్ సినిమా గురించి మాట్లాడిన వీడియో ఒకటి మళ్లీ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఇలా చెప్పాడు. ' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్‌కు.. సలార్ రీమేక్ అని అందులో ఆయన ఆయన చెప్పారు. ఆ వీడియోలో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో క్లారిటీ లేదు. కానీ ఉగ్రం సినిమా చూసిన వారికి మూవీ లైన్‌ను సరిచూస్తే కొంతమేరకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇందులో నిజం ఉండదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కన్నడలో ఉగ్రం సినిమా భారీ హిట్ క్టొటింది. మళ్లీ ఇదే సినిమాను రీమేక్‌గా ప్రశాంత్ నీల్ ఎందుకు తీస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఉన్న ఉగ్రం సినిమాకు 50 మిలియన్లకు పైగానే వ్యూస్ వచ్చాయి. ఎవరో కావాలనే ప్రభాస్ సినిమాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. -
టాలీవుడ్‌కి స్వరాలందిస్తున్న పరభాష సంగీత దర్శకులు!
తెలుగు తెరపై పరభాషా తారలు చాలామంది కనిపిస్తుంటారు. తెరవెనక పరభాషా సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. ముఖ్యంగా పలువురు పరభాషా సంగీతదర్శకులు టాలీవుడ్‌కి ట్యూన్ అయ్యారు. ఈ ఏడాది తెలుగు చిత్రాలకు ఎక్కువగా ఇతర భాషల సంగీతదర్శకులు ట్యూన్లు ఇస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. ‘కేజీఎఫ్ 1, 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు రవి బస్రూర్ (కన్నడ). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రానికి, అలాగే సీనియర్ నటుడు హరనాథ్ సోదరుడు, నటుడు వెంకట సుబ్బరాజ్ తనయుడు హీరోగా పరిచయమవుతున్న ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రానికి కూడా రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. ∙గతంలో ‘బిల్లా రంగా, గురు’ ఇటీవల ‘దసరా’ చిత్రాలకు సంగీతం అందించారు సంతోష్ నారాయణన్ (తమిళ్). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’కి, వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో ప్రారంభమైన ‘సైంధవ్’ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరోగా, సంగీత దర్శకునిగా కొనసాగుతున్న జీవీ ప్రకాశ్‌కుమార్ (తమిళ్) ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’కి, నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు. మాతృభాష మలయాళంలో ‘నోట్ బుక్’ (2006) ద్వారా సంగీతదర్శకుడిగా కెరీర్ ఆరంభించిన గోపీసుందర్ ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు’ (2015) చిత్రంతో తెలుగుకి వచ్చారు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మజ్ను’, ‘ప్రేమమ్’, ‘గీత గోవిందం’, ‘మజిలీ’ తదితర చిత్రాలకు స్వరాలందించారు. ఇటీవల రిలీజైన ‘18 పేజెస్’, ‘బుట్ట బొమ్మ’ చిత్రాలకు గోపీయే సంగీతదర్శకుడు. ∙‘అజ్ఞాతవాసి’ (2018), నాని ‘గ్యాంగ్‌లీడర్’ (2019) వంటి చిత్రాలకు తనదైన శైలిలో సంగీతం అందించారు అనిరుధ్ రవిచంద్రన్. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు. ‘జర్నీ’ (2011), ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ (2013), ‘సిటిజన్’ (2013) వంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌కి పరిచయమైన సి.సత్య (తమిళ్) ప్రస్తుతం స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్నారు. పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సత్యనే స్వరకర్త. తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు హారీస్ జయరాజ్ (తమిళ్). ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, నాగశౌర్య కథానాయకుడుగా చేస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ∙‘కిరాక్ పార్టీ’ (2018) చిత్రంతో తెలుగులోకి సంగీత దర్శకునిగా ఎంట్రీ ఇచ్చారు అజనీష్ లోక్‌నాథ్ (కన్నడ). ఆ తర్వాత ‘నన్ను దోచుకుందువటే’ (2018) మూవీకి స్వరాలు అందించారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన తెలుగులో చేస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ‘ఖుషి’ సినిమాతో తెలుగుకి వస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అలాగే నాని హీరోగా సౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రానికి హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలను 1980ల నుంచి తెలుగు శ్రోతలు వింటున్నారు. తెలుగు పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఇళయరాజాది. ఇటీవల విడుదలైన ‘రంగ మార్తాండ’కు ఆయనే స్వరకర్త. అలాగే త్వరలో విడుదల కానున్న ‘మ్యూజిక్ స్కూల్’కి కూడా స్వరాలందించారు. ఇక ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా టాలీవుడ్ కెరీర్ ‘శేషు’ (2002) సినిమాతో ప్రారంభమై, కొనసాగుతోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ చిత్రానికి తండ్రి ఇళయరాజాతో కలిసి స్వరాలు అందించారు యువన్. అలాగే శర్వానంద్ హీరోగా చేయనున్న ఓ చిత్రానికి యువన్ శంకర్ స్వరాలందిస్తున్నారు. వీరే కాదు.. మరికొందరు ఇతర భాషల సంగీత దర్శకులు తెలుగు చిత్రాలకు ట్యూన్లు ఇస్తున్నారు. -
‘శాసన సభ’ కు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం
‘కేజీఎఫ్’ ఫేమ్ సంగీతదర్శకుడు రవి బస్రూర్ వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా ‘శాసన సభ’ చిత్రానికి సంగీతదర్శకుడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్ జంటగా రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ఇది. వేణు మడికంటి దర్శకత్వంలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ–‘‘పొలిటికల్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రమిది. యూనివర్శల్ కథాంశంతో నిర్మించిన ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మెయిన్ పిల్లర్‌గా ఉంటాయి. ‘కేజీఎఫ్–2’ తర్వాత తెలుగులో ఆయన్నుంచి వస్తున్న చిత్రమిది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.