సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జీబ్రా’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.
ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment