
సత్యదేవ్, ధనుంజయ, ఈశ్వర్, ఎస్‌ఎన్ రెడ్డి
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులు బై బై చెప్పుకున్నారు.
‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment