
హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ మంచి సినిమా అనిపించుకుంది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మరో చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్ చాలా పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. విభిన్నమైన పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్యా మీనన్, కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాత: సీవీ రావు.
Comments
Please login to add a commentAdd a comment