
హీరోయిన్ ఈషా రెబ్బా నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత శ్రీనివాస్ కానూరు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, కెమెరామన్ ‘గరుడవేగ’ అంజి, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment