
Satyadev Godse Movie Releasing This April: సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 20న విడుదల కానుంది. ‘‘సత్యదేవ్, గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ హిట్ కావడంతో ‘గాడ్సే’పై మంచి అంచనాలున్నాయి. అవినీతిమయమైన రాజకీయ నాయకుణ్ణి, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు. ఐశ్వర్యా లక్ష్మిది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.