సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ చిత్రంలో అతీరా రాజ్ హీరోయిన్. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘వించిపేట భద్ర, శివ, కోటి అనే ముగ్గురి స్నేహితుల నేపథ్యంలో సాగే కథ ఇది. కథ ప్రధానంగా 2003–2015 మధ్యకాలంలో జరుగుతుంది.
కొంతకాలంగా నేను ఎదురు చూస్తున్న మంచి హిట్ ‘కృష్ణమ్మ’తో లభిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘రాజకీయాలు, రౌడీయిజం అంశాలు ‘కృష్ణమ్మ’ సినిమాలో లేవు. విజయవాడను మరో కోణంలో చూసేలా ఈ చిత్రం ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశాం. కృష్ణమ్మ నదిలో ఎలా అయితే మలుపులు ఉంటాయో భద్ర, కోటి, శివ జీవితాల్లో కూడా మలుపులు ఉంటాయి. ఈ మలుపులను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు వీవీ గోపాలకృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment