
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. శరణ్ కొప్పిశెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా మే 21న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వినోదంతో పాటు సందేశాత్మకంగా రూపొందిన చిత్రమిది. అన్ని రకాల వాణిజ్య అంశాలున్నాయి.
సత్యదేవ్ లాయర్ పాత్రలో నటించారు. ఆయన లుక్, క్యారెక్టర్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు దర్శకుడు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. బ్రహ్మాజీ, అజయ్, ‘అల్లరి’ రవిబాబు, అంకిత్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు.