Satyadev Godse Movie Teaser Released By Chiranjeevi - Sakshi
Sakshi News home page

Godse Movie: సత్యదేవ్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు.. ఆలోచింపజేసేలా 'గాడ్సే' టీజర్‌

Published Mon, Dec 20 2021 4:29 PM | Last Updated on Mon, Dec 20 2021 5:52 PM

Satyadev Godse Movie Teaser Released By Chiranjeevi - Sakshi

Satyadev Godse Movie Teaser Released By Chiranjeevi: విభిన్న కథా చిత్రాలతో అలరించే హీరోల్లో సత్యదేవ్‌ ఒకరు. ఇటీవల 'స్కైలాబ్‌' అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్‌ గాడ్సేగా రాబోతున్నాడు. దర్శకుడు గోపీ గణేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలు, నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న గాడ్సే ప్రమోషన్స్‌ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్‌  చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌  విడుదల చేస్తూ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్ చెబుతూ ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌.

విడదల చేసిన టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. సత్యదేవ్‌ చెప్పే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయయే తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అంటూ సత్యదేవ్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. అలాగే 'సేవ చేస్తున్నందుకు వంద, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్‌రా?' అనే డైలాగ్‌ ప్రజలను ఆలోచింపజేసేలా ఉంది. సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. నాగబాబు, తనికెళ్ల భరణి, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్‌ త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement