
లాక్‌డౌన్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రం విజయంతో ఫుల్ స్పీడు మీదున్నారు సత్యదేవ్. వైవిధ్యమైన సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే సత్యదేవ్ హీరోగా రూపొందిన చిత్రం‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్ వాలి’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. శనివారం ‘తిమ్మరుసు’ చిత్రం ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 9న టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన చిత్రం ‘తిమ్మరుసు’. సత్యదేవ్‌ను ఈ సినిమాలో కొత్తగా ఆవిష్కరిం^è బోతున్నాం. చిత్రీకరణ పూర్తయింది, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల.
Comments
Please login to add a commentAdd a comment