'కంగువ' నిర్మాత ఫోన్ వాల్ పేపర్‌గా రాజమౌళి ఫొటో | Suriya And Rajamouli At Kanguva Pre Release Event | Sakshi
Sakshi News home page

Suriya: రాజమౌళిపై ఇష్టం.. సీక్రెట్ బయటపెట్టిన సూర్య

Published Fri, Nov 8 2024 9:53 AM | Last Updated on Fri, Nov 8 2024 11:21 AM

Suriya And Rajamouli At Kanguva Pre Release Event

తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాజమౌళి అతిథిగా వచ్చారు. కాకపోతే రాజమౌళిపై తనకు, తన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు ఎంత ఇష్టముందో అనేది చెప్పకనే చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)

'కంగువ' టీమ్‌కి కోసం వచ్చిన రాజమౌళి అంతా మాట్లాడిన తర్వాత సూర్య మైక్ అందుకున్నాడు. తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా అని రాజమౌళితో సినిమా చేయాలని ఉందని సూర్య తన మనసులో మాటని బయటపెట్టాడు.

మీ 'బాహుబలి' పేరు పలకడానికి కూడా మాకు అర్హత ఉందో లేదో తెలీదు. మీరు వేసిన దారిలోనే మేం మీ వెనుక నడుస్తూ వస్తున్నాం. మీరు మా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి షేక్ హ్యాండ్ ఇస్తే అదే మాకు పెద్ద ఆస్కార్ అని సూర్య చెప్పాడు. జ్ఞానవేల్ రాజా తనకు పరిచయమైనప్పటి నుంచి మీ ఫొటోనే ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడనే ఆసక్తికర విషయాన్ని  బయటపెట్టాడు. దీంతో జ్ఞానవేల్ రాజా స్టేజీపైకి వచ్చి తన ఫోన్‌లోని రాజమౌళి ఫోటో చూపించడంతో పాటు రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. 

(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement