సూర్య హీరోగా నటించిన కంగువా సినిమాపై డివైడ్ టాక్ రావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కంగువా మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదని ప్రేక్షకులు చెప్పిన మాట నిజమేనని జ్యోతిక కూడా తెలిపింది. సినిమా ప్రారంభమే కాస్త బోర్‌గా ఉండటంతో కంగువాపై భారీ ప్రభావం చూపిందని చెప్పవచ్చు.
కంగువా చిత్రం రెండో భాగం చాలా బాగుందని రివ్యూస్ వచ్చాయి. ఫైనల్‌గా మొదటి అరగంటపై ఎక్కువ విమర్శలు రావడంతో అందులో నుంచి 12 నిమిషాల నిడివిని కత్తిరించారు. ఇప్పుడు ఈ చిత్రం రన్‌టైమ్ 2.22గంటలు మాత్రమే ఉండనుంది. ఈ సినిమా సౌండ్ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. దీనిని కూడా రెండో రోజుకే టెక్నికల్‌గా సరిచేశారు. అదేరోజు సినిమా రన్‌టైమ్ కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదని అభిమానులు కూడా అనుకుంటున్నారు.
ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌తో ఈ కాలానికి సంబంధించిన సన్నివేశాల్ని ట్రిమ్ చేశారని తెలుస్తోంది. గోవా ఎపిసోడ్ కాస్త ఎక్కువ బోరింగ్‌గా ఉండటంతో చాలా సీన్లు లేపేశారని సమాచారం. వెయ్యేళ్ల కిందటి కథకు, వర్తమాన కాలానికి లింక్ పెడుతు కంగువా చిత్రాన్ని తెరకెక్కించారు. కంగువా, ఫ్రాన్సిస్ పాత్రల్లో సూర్య నటన అందరినీ ఆకట్టుకుంది. దిశా పటానీ చిన్న పాత్రలో మెరిసినప్పటికీ తన గ్లామర్‌తో ఫిదా చేస్తుంది. బాబీ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment