‘‘కంగువ’ టీమ్ పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నాను. ‘కంగువ’ లాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ అనుభూతిని ΄పొందుతారు’’ అని డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘కంగువ’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు.
గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాను తెలుగుకే పరిమితం చేయకుండా మిగతా ్రపాంతాలకు తీసుకెళ్లాలని, అలాగే పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. ‘గజినీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి తను చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా నిర్మాతలు, హీరోలకు చెప్పేవాణ్ణి. నేను, తను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం.. కానీ కుదరలేదు. తనతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను’’ అని చెప్పారు. ‘‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్లా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
‘‘ఈ సినిమా విజువల్స్, కంటెంట్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ‘కంగువ’ ఘన విజయం సాధించాలి’’ అని నిర్మాతలు సురేష్ బాబు, ‘దిల్’ రాజు తెలిపారు. ‘‘వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ ‘కంగువ’లో చూపించాం’’ అన్నారు శివ. ‘‘కంగువ’ వంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. సూర్య మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి ఏ సినిమాతోనూ మా ‘కంగువ’ని పోల్చలేం. ఆయనతో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్నాను.
కానీ, ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ‘కంగువ’ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చింది. ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఎవర్ గ్రీన్ సినిమాగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను’’ అని తెలిపారు. ఈ వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కెమెరామేన్ వెట్రి పళనిస్వామి, రైటర్ రాకేందు మౌళి, డిస్ట్రిబ్యూటర్ అభినేష్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూఛిబొట్ల తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment