ఎగువ నుంచి భారీ వరద... దిగువకు 2,67,906 క్యూసెక్కుల నీరు
నాగార్జునసాగర్/దోమలపెంట: కృష్ణా ఎగువ నుంచి భారీస్థాయిలో నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది.దీంతో గురు వారం ప్రాజెక్టు మొత్తం 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తారు. గేట్ల ద్వారా 2,67,906 క్యూసెక్కులు, ప్రధాన విద్యుదుతాμదన కేంద్రం ద్వారా 28,501 క్యూసెక్కులు.. మొత్తంగా 2,96,407 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు(312.5050 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 586.00 అడుగుల( 300.3200 టీఎంసీల) నీటి నిల్వలున్నాయి.
15 ఏళ్లలో 11సార్లు తెరుచుకున్న మొత్తం గేట్లు ఈ పదిహేను సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లు 11సార్లు తెరుచుకు న్నాయి. 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2019, 2020, 2021, 2022, 2024 సంవత్సరాల్లో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత కూడా 2.5లక్షల క్యూసెక్కులు వరద వస్తే కచ్చితంగా 26 గేట్లు తెరవాల్సిందేనని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును చూడటానికి వచిన సందర్శకులు
● శ్రీశైలం జలాశయానికి వరద మళ్లీ కాస్త పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు 3,15,000 ఇన్‌ఫ్లో ఉండగా.. 45 గేట్లు ఎత్తి సిμల్‌వే ద్వారా 3,13,065 క్యూసెక్కులు, విద్యుదుతμత్తి ద్వారా 19,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సుంకేశుల నుంచి మరో 58,227 క్యూసెక్కులతో మొత్తం 3,91,066 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో పది గేట్లు ఎత్తి 3,08,480 క్యూసెక్కులు,విద్యుదుతμత్తి ద్వారా 65,410 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా, సాగర్‌కు చేరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment