కృష్ణా తరంగాలపై ఆధ్యాత్మిక యాత్ర  | Boat journey from Durgamma Chenta to Amareshwari | Sakshi
Sakshi News home page

కృష్ణా తరంగాలపై ఆధ్యాత్మిక యాత్ర 

Published Mon, Oct 23 2023 4:46 AM | Last Updated on Mon, Oct 23 2023 4:46 AM

Boat journey from Durgamma Chenta to Amareshwari - Sakshi

సాక్షి, అమరావతి: జీవన వాహిని కృష్ణవేణి ప్రవాహ మార్గంలో ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఎన్నో.. అటువంటి కృష్ణమ్మ ఒడిలో పడవపై ఆధ్యా­త్మిక యాత్రకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీ­టీడీసీ)శ్రీకారం చుడుతోంది. ప్రకృతి రమణీ­యత, ఆధ్యాత్మిక శోభ కలయికగా ప్రాజెక్టును రూపొం­ది­స్తోంది. విజ­యవాడ నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై ప్రత్యేక బోటు తిప్పేందుకు చర్యలు చేపడు తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని మూడు దేవా ల­యాలు, 2 పర్యాటక ప్రాంతాలను ఒక్క రోజులో చుట్టివచ్చేలా ప్రయాణ మార్గాన్ని రూపొందిస్తోంది.

80 కిలోమీటర్ల ప్రయాణం
ఎకో–ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా ఏపీటీడీసీ కృష్ణానదిలో రానుపోనూ సుమారు 80 కిలోమీటర్ల బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. విజయవాడలోని బెరంపార్కులో బయలుదేరే బోటు తొలుత కనకదుర్గమ్మ ఘాట్‌కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తరువాత అనంతవరంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తారు.

మధ్యాహ్నం భోజనం తరువాత తిరుగు ప్రయాణంలో పవిత్ర సంగమం, భవానీద్వీపంలో ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. ఈ యాత్ర­లో ఆలయాల దర్శనంతో పాటు భో జన సదుపా­యాలను ఏపీటీడీసీ ఏర్పా టు చేస్తుంది. బోటులో గైడ్‌ను అందుబాటులో ఉంచనుంది. నాగా ర్జున సాగర్‌ నుంచి తీసుకొచ్చిన డబుల్‌ ఇంజిన్‌ బోటును ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తోంది. 40–45 మంది పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా ఈ బోటులో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రయాణ సమయంలో పర్యాటకులకు బో టు లోనే ఆహారం అందుబాటులో ఉంచడంతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశా­ల్లోనూ అమృత్‌ కియోస్క్‌లను ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. అధికారుల బృందం అమరా­వతి వరకు ట్రయల్‌ రన్‌ పూర్తి చేసింది. బోటు సిద్ధమైన తరువాత అధికారికంగా మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. టికెట్‌ రేట్లు నిర్ణయించేందుకు ఏపీటీడీసీ ప్రత్యేక కమిటీని నియమించనుంది. తొలుత వారాంతాల్లో ఒకసారే ఈ యాత్రను చేపట్టాలని భావిస్తోంది. పర్యాటకుల ఆసక్తి మేరకు నెమ్మదిగా యాత్రల సంఖ్యను పెంచనుంది. 4 వారాల్లోగా బోటును సిద్ధం చేసి కార్తీకమాసంలో యాత్రకు పచ్చజెండా ఊపేలా కసరత్తు చేస్తోంది.

ఈ ప్యాకేజీలో స్పెషల్‌ దర్శనం
పర్యాటకులకు దైవ దర్శనంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా కృష్ణానదిపై బోటు యాత్రను తీసుకొస్తున్నాం. పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సంతోషంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వాటర్‌ సర్క్యూట్‌ టూరిజం కచ్చితంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులో వెళ్లి దైవ దర్శనం చేసుకోవడంతో పోల్చితే ఇది ఎంతో సులభంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో స్పెషల్‌ దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదం అందజేస్తాం. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.     – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement