amareshwar
-
కృష్ణా తరంగాలపై ఆధ్యాత్మిక యాత్ర
సాక్షి, అమరావతి: జీవన వాహిని కృష్ణవేణి ప్రవాహ మార్గంలో ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఎన్నో.. అటువంటి కృష్ణమ్మ ఒడిలో పడవపై ఆధ్యాత్మిక యాత్రకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)శ్రీకారం చుడుతోంది. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక శోభ కలయికగా ప్రాజెక్టును రూపొందిస్తోంది. విజయవాడ నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై ప్రత్యేక బోటు తిప్పేందుకు చర్యలు చేపడు తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని మూడు దేవా లయాలు, 2 పర్యాటక ప్రాంతాలను ఒక్క రోజులో చుట్టివచ్చేలా ప్రయాణ మార్గాన్ని రూపొందిస్తోంది. 80 కిలోమీటర్ల ప్రయాణం ఎకో–ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా ఏపీటీడీసీ కృష్ణానదిలో రానుపోనూ సుమారు 80 కిలోమీటర్ల బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. విజయవాడలోని బెరంపార్కులో బయలుదేరే బోటు తొలుత కనకదుర్గమ్మ ఘాట్‌కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తరువాత అనంతవరంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తారు. మధ్యాహ్నం భోజనం తరువాత తిరుగు ప్రయాణంలో పవిత్ర సంగమం, భవానీద్వీపంలో ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. ఈ యాత్రలో ఆలయాల దర్శనంతో పాటు భో జన సదుపాయాలను ఏపీటీడీసీ ఏర్పా టు చేస్తుంది. బోటులో గైడ్‌ను అందుబాటులో ఉంచనుంది. నాగా ర్జున సాగర్ నుంచి తీసుకొచ్చిన డబుల్ ఇంజిన్ బోటును ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తోంది. 40–45 మంది పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా ఈ బోటులో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో పర్యాటకులకు బో టు లోనే ఆహారం అందుబాటులో ఉంచడంతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లోనూ అమృత్ కియోస్క్‌లను ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. అధికారుల బృందం అమరావతి వరకు ట్రయల్ రన్ పూర్తి చేసింది. బోటు సిద్ధమైన తరువాత అధికారికంగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. టికెట్ రేట్లు నిర్ణయించేందుకు ఏపీటీడీసీ ప్రత్యేక కమిటీని నియమించనుంది. తొలుత వారాంతాల్లో ఒకసారే ఈ యాత్రను చేపట్టాలని భావిస్తోంది. పర్యాటకుల ఆసక్తి మేరకు నెమ్మదిగా యాత్రల సంఖ్యను పెంచనుంది. 4 వారాల్లోగా బోటును సిద్ధం చేసి కార్తీకమాసంలో యాత్రకు పచ్చజెండా ఊపేలా కసరత్తు చేస్తోంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం పర్యాటకులకు దైవ దర్శనంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా కృష్ణానదిపై బోటు యాత్రను తీసుకొస్తున్నాం. పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సంతోషంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వాటర్ సర్క్యూట్ టూరిజం కచ్చితంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులో వెళ్లి దైవ దర్శనం చేసుకోవడంతో పోల్చితే ఇది ఎంతో సులభంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదం అందజేస్తాం. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ -
వినియోగదారుల కేసుల పరిష్కారంలో కృత్రిమ మేధ
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: వినియోగదారుల హక్కులకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం కృత్రిమ మేధని వినియోగిస్తుండటం శుభపరిణామమని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్(ఎన్సీఆర్డీ) అధ్యక్షుడు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ‘వినియోగదారుల హక్కులు, రక్షణ’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శులు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు, వినియోగదారుల గ్రూపులు, ఎన్జీవోలు హాజరయ్యారు. వినియోగదారుల రక్షణ ఫ్రేమ్‌వర్క్, డెవలప్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్, ప్రెస్ మానిటరింగ్, లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జస్టిస్ సాహి మాట్లాడుతూ వినియోగదారుల కమిషన్ గత ఏడాది 1.26 లక్షల కేసులు పరిష్కరించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1.36 లక్షల కేసులు పరిష్కరించడం శుభపరిణామమని చెప్పారు. కేసుల పరిష్కారం కోసం కాన్ఫోనెట్ 2.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దీనిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. వినియోగదారులు 17 ప్రాంతీయ భాషల్లో ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. ప్రతి నెలా వినియోగదారుల హక్కుల కంట్రోల్ రూమ్‌కు లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు తమ హక్కుల పట్ల అవగాహన పెరిగిందని, ఇది స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్, ప్రత్యేక కార్యదర్శి నిధి ఖరే, ఏపీ ప్రభుత్వ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడటంతోపాటు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆయా రాష్ట్రాల సహకారంతో పని చేస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా తూనికలు, కొలతల పరికరాలను విక్రయించడానికి అంతర్జాతీయంగా ఆమోదించిన ఓఐఎంఎల్ సర్టిఫికెట్లను జారీ చేసే అథారిటీని పొందిన 13వ దేశంగా భారత్‌ను జాబితాలో చేర్చడంలో కృషి చేసిన లీగల్ మెట్రాలజీ విభాగానికి అభినందనలు తెలిపారు. -
భారీవర్షంలోనూ చెక్కుచెదరని సంకల్పం
ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం.. అయినా చెక్కుచెదరని సంకల్పం. రాజన్న మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారిని పరామర్శించాలన్న దీక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాలో సాగిస్తున్న పరామర్శ యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. కొడంగల్, కోస్గి ప్రాంతాలలో గురువారం నాడు భారీ వర్షం కురిసింది. ఆ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా షర్మిల తన పరామర్శ యాత్రను కొనసాగించారు. ఇది పరామర్శ యాత్ర కాదని, పేద ప్రజల భరోసా యాత్ర అని గుయ బసవయ్య కొడుకు అమరేశ్వర్ వైఎస్ షర్మిలతో అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఆయన చెప్పారు. ఆ పథకాలన్నింటి సంరక్షకులం మనమేనని ఆయన అన్నారు.