కృష్ణమ్మా.. సీఎంకు సద్బుద్ధి ప్రసాదించూ.. | moment for sidheswaram alugu | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మా.. సీఎంకు సద్బుద్ధి ప్రసాదించూ..

Published Sun, Aug 21 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

కృష్ణమ్మా.. సీఎంకు సద్బుద్ధి ప్రసాదించూ..

కృష్ణమ్మా.. సీఎంకు సద్బుద్ధి ప్రసాదించూ..

– సిద్ధేశ్వరం అలుగు సాధనకోసం రైతుల సంకల్పం
  
ఆత్మకూరురూరల్‌(సంగమేశ్వరం): రాయలసీమపట్ల వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణవేణి మాత సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం సంకల్ప దీక్షలో భాగంగా పలువురు రైతులు సంగమేశ్వరం ఘాట్‌లో పుష్కర స్నానాలాచరించారు. సిద్ధేశ్వరం అలుగు సాధన కమిటీ నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, కన్వీనర్‌ ఏర్వ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రైతులు సంకల్ప దీక్ష పూనారు. ఈ సంధర్భంగా  బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ కన్నుల పండుగగా  శ్రీశైలం ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌ దరిదాపుగా నిండుకుండలా ఉన్నప్పటికి ఇంకా రాయలసీమ జలాశయాలను పూర్తి స్థాయిలో నింపక పోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం సీమకు సాగునీటి జలాలను విడుదల చేస్తున్నట్లు తప్పుడు ప్రకటనలిస్తు  నిప్పుల వాగుద్వారా  నెల్లూరుకు శ్రీశైలం నీటిని తరలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాయలసీమ పట్ల కపట విధానం విడిచి సిద్ధేశ్వరం అలుగునిర్మాణానికి పూనుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్‌ రెడ్డి, మహేశ్వర రెడ్డి, శ్రీనివాస రెడ్డి, కామని వేణుగోపాల్‌ రెడ్డి, వెంకట సుబ్బయ్య, శివరాం రెడ్డి, జ్యోతిర్మయి, పద్మావతి, నిత్యలక్ష్మి, సీపీఎం నాయకులు  ఏసురత్నం, స్వాములు పాల్గొన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement