‘కృష్ణా’ నీటిపై నేడే భేటీ
- వాదనలతో సిద్ధమైన తెలంగాణ, ఏపీ
- 103 టీఎంసీలు కోరుతున్న తెలంగాణ
- ఇప్పటికే అదనంగా వాడారంటున్న ఏపీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. ఇరు రాష్ట్రాల నీటి అవసరాలను తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం కీలక భేటీ నిర్వహించనుంది. ఇందులో రెండు రాష్ట్రా లు తమ నీటి అవసరాలపై సమర్పిం చిన ఇండెంట్‌లతోపాటు మైనర్ ఇరిగేషన్ కింద నీటి లెక్కలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో 103 టీఎంసీలు కేటారుుంచాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ 47 టీఎంసీల మేర కోరుతోంది. ఇప్పటివరకు వచ్చిన నీటిలో ఎక్కువగా ఏపీ వినియోగించిందని తెలంగాణ చెబుతుండగా, తెలంగాణయే అధికంగా వాడిందని ఏపీ పేర్కొంటోంది.
దీనికి తోడు తెలంగాణలో కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండాయని, వాటి కింద 89.15 టీఎంసీల మేర నీటి వినియోగించారని అం టోంది. దీన్ని తెలంగాణ ఖండిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా చెరువుల కింద 20 నుంచి 25 టీఎంసీలకు మించి వినియోగం లేదని స్పష్టం చేస్తోంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలించిన 50 టీఎంసీలను కృష్ణాలో చేసిన వినియోగం కిందే చూడాలని డిమాండ్ చేస్తోంది. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద ఏపీకి ఉన్న వాటా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. దీనిపై బోర్డు ఎలా స్పందిస్తుం దన్నది బుధవారంనాటి సమావేశంలో తేలనుంది.
ఆ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వద్దు..
గోదావరి నదీ జలాలను వినియోగిం చుకుంటున్న ప్రాజెక్టులపై బోర్డు పర్యవేక్షణ సరిపోతుందని తెలంగాణ పేర్కొంది. వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు గోదావరి బోర్డు ఇచ్చిన ముసారుుదా నోటిఫికేషన్‌పై తన అభిప్రాయాలను తెలిపింది.