శరవేగంగా సాగర్ ఆధునీకరణ పనులు
- ఎడమ కాల్వ కింద 90 శాతం పనులు పూర్తి
- కాల్వ కింద 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు
- హరీశ్‌రావుకు అధికారుల నివేదిక
- మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నారుు. ఎడమ కాలువకు సంబంధించి ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా.. మిగతా చోట్ల సైతం వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు ‘కాడా’ కమిషనర్ మల్సూర్, సాగర్ సీఈ సునీల్‌లు శుక్రవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు నివేదిక సమర్పించారు. ఏయే ప్యాకేజీల పనులు ఏ మేరకు పూర్తయ్యాయో వివరించారు. సాగర్ ఎడమ కాలువ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో సహా మొత్తం రూ.1,611 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 2014 జూన్‌కు ముందు రూ.634 కోట్లు ఖర్చు చేయగా.. గత రెండేళ్లలో రూ.732 కోట్లు ఖర్చు చేసి మిగతా పనులు పూర్తి చేస్తున్నారు.
ఎడమ కాలువ పరిధిలో పనులను 10 ప్యాకేజీల కింద విభజించగా.. ఇప్పటివరకు 5, 6, 15 ప్యాకేజీల పనులు పూర్తయ్యారుు. 1, 16, 17 ప్యాకేజీల్లో 90 శాతం.. 2, 3, 4, 7 ప్యాకేజీల్లో 70 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు. ఇక ఎడమ కాలువకు అనుబంధంగా మరో 25 డిస్ట్రిబ్యూషన్ కాలువల్లోనూ మరమ్మతు పనులు జరుగుతున్నారుు. నాలుగు ప్యాకేజీల పరిధిలో డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తికాగా.. మరో 6 ప్యాకేజీల పరిధిలో దాదాపు పూర్తి కావచ్చారుు. మరో 9 ప్యాకేజీల్లో 70 శాతానికి పైగా పూర్తయ్యారుు. మొత్తంగా డిస్ట్రిబ్యూషన్ కాలువల్లో 80 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు. ఇక నీటి వినియోగ సహకార సంఘాల కింద ఉన్న 9 ప్యాకేజీల్లో పనులు పూర్తయ్యాయి. మరో 21 ప్యాకేజీల్లో 80 శాతానికి పైగా పనులు పూర్తయినట్లు నివేదికలో తెలిపారు. ఈ మొత్తం పనులు పూర్తయితే ఎడమ కాలువ కింద 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.
త్వరగా పూర్తి చేయండి
కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి కేటారుుంపులను సమర్థంగా వాడుకుంటే.. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణను చూడవచ్చని హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. సాగర్ ఎడ మ కాలువ ఆధునీకరణ పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లయినా ఇంకా పూర్తికాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కాలువల మరమ్మతులు పూర్తి చేయాలని, అడ్డంకులను అధిగమించాలని అధికారులకు సూచించారు. సీఈ, ఎస్‌ఈ, ఈఈ స్థారుు అధికారులంతా రెగ్యులర్‌గా పనులు జరిగే ప్రదేశాలకు వెళ్లాలని, కుటుంబ సభ్యుల్లా కలసి పని చెయ్యాలని పేర్కొన్నారు.