
చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం
సీఎంపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్య
రాయదుర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు కూరల్లో కరివేపాకులా వ్యక్తులను అవసరమైనపుడు మాత్రమే వాడుకుని వదిలేసే రకమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ అప్రదిష్టను తొలగించుకోవడానికే తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాయదుర్గం నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సభలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాబుకు ఉన్నంత ఆశ దేశంలో ఏ ఒక్కరికీ లేదన్నారు. జిల్లాకు సాగునీరు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని కోరారు. రాజకీయాల్లో డబ్బుకే ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల జేబుల్లో చేతులు పెట్టకూడదని, అలా అలవాటు చేసుకుంటే వారి రాజకీయ జీవితం ముగిసినట్టేనని పేర్కొన్నారు.