సంతకాలు సగమే
సంతకాలు సగమే
Published Fri, Feb 24 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఆది నుంచీ అవాంతరాలు
సంతకాలకు దూరంగా çసగం మంది
సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆది నుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతా సాఫీగా సాగిపోతోందని ... రైతులంతా పూర్తి అంగీకారంగా ఉన్నారని ‘దేశం’ నేతలు ... అధికారులు ఓ వైపు చెబుతున్నా ఇంకోవైపు సగం మంది రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పలు పథకాల్లో తమ భూములను కోల్పోయామని, ఉన్న కొద్దిపాటి భూములు ఇచ్చేది లేదని ఎదురుతిరిగి పైప్‌లై¯ŒS మార్గంలో భూసేకరణ నిమిత్తం చేపట్టిన సర్వేలను అడ్డుకున్నారు. రాజకీయ ఒత్తిడితో, అధికారుల బెదిరింపులతో సగం మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పథకంలో పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రైతులున్నారు. మొత్తం రైతులు 321 మంది ఉండగా, 203.62 ఎకరాలు భూసేకరణలో ఉంది. ఇప్పటికి 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలుత భూ సర్వేను రైతులు అడ్డుకుని నిలిపివేయడంతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి రైతులతో సంప్రదించగా భూసర్వే సక్రమంగా జరిగింది. పరిహారం విషయంలో పలు సమావేశాలు, చర్చలు అనంతరం రూ.28 లక్షలు అందిస్తామని, నాగంపల్లి రెవెన్యూలో రూ.24 లక్షలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులను ఒప్పించారు. దీంతో 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మిగిలిన 115 మంది రైతులు సంతకాలు చేయలేదు. వీరికి అధికారులు, ప్రజాప్రతినిధులు బుజ్జగింపు చర్యలు చేపట్టారని సమాచారం.
రూ.28 లక్షలు నష్టదాయకమే...
ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచామని చెప్పి రూ.28 లక్షలు అందించడం కూడా కొంతమంది రైతులకు రుచించడం లేదు. మార్కెట్ ధర కూడా ప్రభుత్వం అందించడం లేదని, ఎకరానికి రూ.50 లక్షలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సగానికి పైగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతులకు పరిహారం మార్చి నెలాఖరుకు అందించే అవకాశం ఉంది. భూ సేకరణ చట్టం ప్రకారం రూ.28 లక్షలు వస్తుందని, అదనంగా ఫల వృక్షాలకు, బోరులకు ధర చెల్లించాల్సి ఉంటుందని, రైతులకు పెంచి ఇచ్చింది ఏమీ లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
కోర్టును ఆశ్రయించే దిశగా అడుగులు..
ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయని రైతులు త్వరలో కోర్టును ఆశ్రయించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో రెండు ప్రముఖ ప్రాజెక్టులకు స్టే తీసుకువచ్చిన తెలంగాణా న్యాయవాదులను రైతులు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement