
నీటిని వృధాగా సముద్రంలో కలిపారు
శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉన్నా రాయలసీమకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు
అమరావతి: శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉన్నా రాయలసీమకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ప్రాజెక్టులపై మాట్లాడిన వైఎస్ జగన్.. ఆర్‌అండ్‌ఆర్ కింద తెలంగాణకు 120 కోట్లు కట్టి ఉంటే పులిచింతలకలో 48 టీఎంసీలు నిల్వచేసే అవకాశం ఉండేదని అన్నారు.
కృష్ణా బేసిన్‌లో 40 శాతం ఇన్‌ఫ్లో తగ్గిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. 55 టీఎంసీల నీటిని సముద్రంలో వృధాగా కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ నుంచి 42 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించారని అన్నారు.