
సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎంపీ కవిత
మంథని/మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ కరువు తీరనుందని ఎంపీ కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ పనులు, మహదేవపూర్ మండలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ పనులను మంగళవారం ఆమె సందర్శించారు. జూన్ నాటికి రాష్ట్రంలోని ప్రాజె క్టులన్నీ పూర్తవుతాయని కవిత తెలిపారు.
అన్నారం బ్యారేజీ నుంచి 2 టీఎంసీల నీటిని ప్రతిరోజూ వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీరు 2050 వరకు ఎలాంటి కొరత లేకుండా కాళేశ్వరం ద్వారా అందనుందన్నారు. కవిత వెంట మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, పుట్ట మధు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment