సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..శ్రీశైలం ప్రాజెక్టు నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశామని..మరో పది రోజులు వరద వస్తే.. నాగార్జున సాగర్‌లో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు. రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు అన్ని నదుల వరద, ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేస్తూ నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.
టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..
ముంపు ప్రాంతాలను తరలించకుండా గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్‌ను నిర్మించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక లోపం స్పష్టంగా కనబడుతోందన్నారు. సాక్షాత్తు లోకేష్‌ను గిరిజనులు నిలదీశారని..అయినా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాల హృదయంతో స్పందించారని తెలిపారు. ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా ఐదు వేలు సాయం ప్రకటించారన్నారు. 25 వేల కుటుంబాలకు మేలు జరిగేలా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment