
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ వల్లే పోలవరం నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని సాగునీరు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పేరు చెప్పి కమీషన్లు దండుకున్నది చంద్రబాబు నాయుడేనని ఆయన విమర్శించారు. మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నెల్లూరులో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నారా లోకేష్ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. లోకేష్ మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించకు. రైతులను హింసించిన చరిత్ర మీ నాన్నది. టీడీపీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితి లేదు. (లోకేష్ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదు..)
పప్పు మహరాజ్ ..జాగ్రత్తగా మాట్లాడు. నోరు వుందని వాగితే.. రోడ్డు మీద నిలబెడతాం. పోలవరం ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తామని తెలిసే ముందుగానే నువ్వు మీసాలు తీసేశావు. లాలూచీ పడేది మీరు. మీ నాన్న ఘనకార్యం వల్లే పోలవరానికి ఈ గతి పట్టింది. దమ్ము, ధైర్యంతో పని చేసేది సీఎం వైఎస్ జగన్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం సుభీక్షంగా ఉంది. రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. 2021 నాటికి పోలవరం పూర్తికి చేయడానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. (ఆ విషయంలో బాబు కాంప్రమైజ్ అయ్యారు..)
Comments
Please login to add a commentAdd a comment