లోకేష్‌.. పడవలు ఎక్కడ?: అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కౌంటర్‌ | YSRCP Anil Kumar Yadav Political Counter To Nara Lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్‌.. పడవలు ఎక్కడ?: అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కౌంటర్‌

Published Mon, Sep 2 2024 9:29 PM | Last Updated on Mon, Sep 2 2024 9:29 PM

YSRCP Anil Kumar Yadav Political Counter To Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: వాయుగుండం కారణంగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణమ్మ వరద ధాటికి ఏకంగా కరకట్టపై ఉన్న సీఎం చంద్రబాబు ఇంట్లోకి కూడా నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌కు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కౌంటరిచ్చారు. గతంలో లోకేష్‌ కామెంట్స్‌కు బదులిస్తూ.. ఇప్పుడు మీ ఇంటిని ముంచుకోవడానికి  పడవలు అడ్డు పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.

కాగా, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా.. ఏమయ్యా లోకేష్‌.. ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో  పడవలను అడ్డుపెట్టామని అన్నావు. మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా?. మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు. ఆ బోట్లను  త్వరగా తీసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి’ అంటూ కౌంటరిచ్చారు. 

 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement