ప్రతి ఎకరాకు నీటివసతి కల్పించాలి
ఒంగోలు టౌన్ : జిల్లాలోని ప్రతి ఎకరాకు నీటి వసతి కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 ఐ.ప్రకాష్‌కుమార్ సూచించారు.
-
జాయింట్ కలెక్టర్–2 ప్రకాష్‌కుమార్
ఒంగోలు టౌన్ : జిల్లాలోని ప్రతి ఎకరాకు నీటి వసతి కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 ఐ.ప్రకాష్‌కుమార్ సూచించారు. ఆత్మ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కృషి సంశయన యోజనపై వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకాష్‌కుమార్ మాట్లాడారు.
జిల్లావ్యాప్తంగా 9 లక్షల హెక్టార్లకు రబీ, ఖరీఫ్ సీజన్లలో సాగునీరు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం 6 లక్షల హెక్టార్లకు నీటివసతి ఉందని, దానిని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నీటి వసతి కల్పించేందుకు నీటివనరులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మన్నేరు, పాలేరు, మూసి వంటి జీవనదుల వద్ద రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా పంటలకు నీటివసతి కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వంటివాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తదుపరి నిర్వహించే సమావేశానికి పూర్తిస్థాయి నివేదికలతో హాజరుకావాలని ఆదేశించారు. సమావేశంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ సుబ్బారావు, వ్యవసాయ, జలవనరులశాఖ, భూగర్భ జలవనరులశాఖ, ముఖ్య ప్రణాళికశాఖ, ఉద్యాన, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన కాంటెక్ ఇంజినీరింగ్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి ప్రధానమంత్రి కృషి సంశయన యోజన గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.