పాకాల.. ప్రత్యేక ప్రణాళిక...
అన్ని రంగాల్లో అభివృద్ధికి కలెక్టర్ చర్యలు
ఇరిగేషన్ రంగంలో రూ.8కోట్లతో ప్రతిపాదనలు
ఎకో టూరిజంతో పాటు జింకల పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం
కాటేజీలు, విశ్రాంతి గృహం,బోట్ యూనిట్ కూడా..
పాకాల మీదుగా కొత్త రోడ్డుకు రూ.3కోట్లు
హన్మకొండ :వరంగల్ రూరల్ జిల్లాను వ్యవసాయపరంగా అగ్రభాగంలో నిలబెట్టడమే కాకుండా ‘రైస్ బౌల్’గా పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న పాకాల సరస్సు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రఖ్యాతి గాంచిన పాకాల సరస్సును నీటి పారుదల, పర్యాటకపరంగా అభివృద్ధి చేయడంతో పాటు పాకాల మీదుగా రోడ్డు రవాణా విషయంలోనూ మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా వరంగల్ రూరల్ జిల్లాకు సరికొత్త కళ రావడంతో పాటు 962 హెక్టార్ల విస్తీర్ణం కలిగి 3.2 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో 30వేల హెక్టార్లను సస్యశ్యామలం చేస్తున్న పాకాల సరస్సు మరింత ప్రఖ్యాతి చెందనుంది.
సమీకృత అభివృద్ధి
అత్యంత ప్రతిష్టాత్మక పాకాల సరస్సును అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇరిగేషన్, టూరిజం, అటవీ శాఖలతో కలిపి పాకాలను సమీకృత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొంచారు. జిల్లా ఆవిర్భావం సమయంలోనే పాకాలను లక్నవరం సరస్సు స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పిన కలెక్టర్.. ఇందుకు సంబంధించి ఆచరణలో అడుగులు వేస్తున్నారు.
అటవీ శాఖతో కలిసి..
పాకాల సరస్సును పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక, అటవీ శాఖలను సమన్వయం చేస్తూ కలెక్టర్ ముందుకెళుతున్నారు. ఇందులో భాగంగా పాకాలలో ఎకో టూరిజం అభివృద్ధికి రంగం సిద్ధం చేశారు. పర్యాటకంలో భాగంగా వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో వచ్చిన రూ.20లక్షలకు తోడు కలెక్టర్ ప్రత్యేకంగా మరో రూ.15లక్షలు కేటాయించి పాకాలా జింకల పార్క్ ఏర్పాటు కోసం మొత్తం రూ.35లక్షలు అటవీ శాఖకు మంజూరు ఇచ్చారు. మరోవైపు రూ.60లక్షలతో ఆరు కాటేజీలు, ఒక విశ్రాంతి గృహం, మరో బోట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. పెద్ద బోట్లు నడిపేందుకు వీలుగా బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు. అదేవిధంగా పర్యాటకుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు నర్సంపేట నుంచి పాకాల మీదుగా ఇల్లెందు వెళ్లే రోడ్డుకు రూ.3కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయి.
రూ.8కోట్లతో స్లూ గేట్లు..
పర్యాటక రంగంగా పాకాల అభివృద్ధి చేస్తూనే వ్యవసాయ పరంగా మరింత తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు.