కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి
సూరజ్‌కుండ్ (హరియాణ): 2019 నాటికి దేశంలో 76 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉత్పాదక వ్యయాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందన్నారు. సూరజ్‌కుండ్‌లో హరియాణ ప్రభుత్వం నిర్వహించిన ‘వ్యవసాయ సదస్సు– 2017’లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూరియా లాంటి ముఖ్యమైన ఎరువులను తక్కువ ధరకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. వేప పూత యూరియాను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు.
తమ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటికి నాబార్డు నిధుల కింద రూ.20 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. రుతుపవనాల మార్పులతో పంటలకు నష్టం వాటిల్లితే ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం రైతులకు రక్షణగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎక్కడ్నుంచైనా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేవిధంగా జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెట్ (ఈ–నామ్)లను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. 2018 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 585 వ్యవసాయ మార్కెట్లను ఈ– నామ్‌తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
దేశంలో 76 లక్షల హెక్టార్లకు సాగు నీరు
Published Sun, Mar 19 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
Advertisement