Fasal insurance Yojana
-
బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!
పంటల బీమా చెల్లించడంలో సంస్థలు ఆలస్యం చేస్తే 12 శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 8.69 కోట్లకు పెరిగిందన్నారు. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్ల బీమా పొందారని తెలిపారు.ఈ మేరకు లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ..‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై ) కింద రైతులకు చెల్లించాల్సిన బీమా ఆలస్యం చేస్తే కంపెనీలపై 12 శాతం పెనాల్టీ విధిస్తాం. ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రాల ప్రీమియం విడుదలలో జాప్యం జరుగుతోంది. బీమా చెల్లింపుల్లో జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను విడుదల చేస్తుంది. గత ప్రభుత్వంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు అది 8.69 కోట్లకు పెరిగింది. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్లకు బీమా పొందారు. సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలను ఈ పథకం కవర్ చేస్తోంది. 2023లో 5.01 లక్షల హెక్టార్ల పంట భూమి ఈ బీమా పరిధిలోకి వచ్చింది. అది 2024లో 5.98 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దీని ద్వారా 3.57 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ -
దేశంలో 76 లక్షల హెక్టార్లకు సాగు నీరు
కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి సూరజ్‌కుండ్ (హరియాణ): 2019 నాటికి దేశంలో 76 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉత్పాదక వ్యయాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందన్నారు. సూరజ్‌కుండ్‌లో హరియాణ ప్రభుత్వం నిర్వహించిన ‘వ్యవసాయ సదస్సు– 2017’లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూరియా లాంటి ముఖ్యమైన ఎరువులను తక్కువ ధరకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. వేప పూత యూరియాను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటికి నాబార్డు నిధుల కింద రూ.20 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. రుతుపవనాల మార్పులతో పంటలకు నష్టం వాటిల్లితే ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం రైతులకు రక్షణగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎక్కడ్నుంచైనా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేవిధంగా జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెట్ (ఈ–నామ్)లను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. 2018 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 585 వ్యవసాయ మార్కెట్లను ఈ– నామ్‌తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.