పంటల బీమా చెల్లించడంలో సంస్థలు ఆలస్యం చేస్తే 12 శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 8.69 కోట్లకు పెరిగిందన్నారు. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్ల బీమా పొందారని తెలిపారు.
ఈ మేరకు లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ..‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై ) కింద రైతులకు చెల్లించాల్సిన బీమా ఆలస్యం చేస్తే కంపెనీలపై 12 శాతం పెనాల్టీ విధిస్తాం. ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రాల ప్రీమియం విడుదలలో జాప్యం జరుగుతోంది. బీమా చెల్లింపుల్లో జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను విడుదల చేస్తుంది. గత ప్రభుత్వంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు అది 8.69 కోట్లకు పెరిగింది. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్లకు బీమా పొందారు. సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలను ఈ పథకం కవర్ చేస్తోంది. 2023లో 5.01 లక్షల హెక్టార్ల పంట భూమి ఈ బీమా పరిధిలోకి వచ్చింది. అది 2024లో 5.98 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దీని ద్వారా 3.57 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ
Comments
Please login to add a commentAdd a comment