ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)జిల్లాలో 2016-17 లక్ష్యాలను అధిగమించింది.
బిందుసేద్యం లక్ష్యాలు పూర్తి
Published Mon, Apr 3 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
- టార్గెట్ రీచ్ అయిన ఏపీఎంఐపీ
- 15వేల హెక్టార్లకు గాను 15179 హెక్టార్లకు సూక్ష్మసేద్యం
- మార్చిలోనే 3500 హెక్టార్లకు మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)జిల్లాలో 2016-17 లక్ష్యాలను అధిగమించింది. కరువు సీమలో డ్రిప్, స్ప్రింక్లర్ల వ్యవసాయం భారీగా పెరిగింది. వర్షాలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోతున్న నేపథ్యంతో నీటిని పొదుపుగా వినియోగించి అధిగ దిగుబడులు సాధించేందుకు రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యం వైపు దృష్టి సారించారని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 2016-17లో జిల్లాకు 15వేల హెక్టార్లకు సూక్ష్మసేద్యం కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.106 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 15,179 హెక్టార్లకు సూక్ష్మసేద్యం మంజూరు చేశారు. అయితే ఒక్క మార్చిలోనే 3500 హెక్టార్లకు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 11వేల హెక్టార్లకు పరికరాలను కూడా అమర్చారు. మిగిలిన వాటికి నెలాఖరులోగా పూర్తి చేస్తామని పీడీ స్పష్టం చేశారు. 2015-16లో 7380 హెక్టార్లకు మాత్రమే డ్రిప్ కల్పించారు. అదే 2016-17లో రెట్టింపు కంటే ఎక్కువగా ప్రగతి సాధించారు. రూ.106 కోట్లు బడ్జెట్ ఇవ్వగా రూ.86 కోట్లు వ్యయం చేశారు. స్ప్రింక్లర్ల సేద్యం పెరగడం వల్ల నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాలేదు. 7700 హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించగా మిగిలినది స్ప్రింక్లర్ల సేద్యమే. ముఖ్యంగా సూక్ష్మ సేద్యం కారణంగా అరటిలో దిగుబడులు భారీగా పెరిగాయి. ఎస్సీ రైతులకు 1600 హెక్టార్లు, ఎస్టీ రైతులకు 650 హెక్టార్ల వరకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించారు.
Advertisement
Advertisement