తెల్లకార్డుదారులు అందరికీ కల్యాణలక్ష్మి
మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్: తెల్ల కార్డులున్న వారం దరికీ కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 124 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 51 వేల చొప్పున రూ. 63.24 లక్షల ను చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు ఓసీ, బీసీ వర్గాల్లో ప్రతి పేదింటికీ ఈ పథకం వర్తించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని చెప్పారు.
నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే ఇబ్రహీంపూర్ రెండవ స్థానం ఆక్రమించిందన్నారు. భవిష్యత్తులో సిద్దిపేటలోని ప్రతి పల్లె ఇబ్రహీంపూర్‌ను స్ఫూర్తిగా తీసుకొని నగదురహిత లావాదేవీల గ్రామంగా మారాలని పిలుపునిచ్చారు.