హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. మాకు(బీఆర్‌ఎస్)కు సెన్స్ లేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. మరి సెన్స్ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
‘‘రేపు మేడిగడ్డ,అన్నారం పర్యటనకు వెళ్తున్నాం. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లు, అన్నారం బ్యారేజ్ లను పరిశీలిస్తాం. అన్నారం బ్యారేజ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తాం. కడియం శ్రీహరి, హరీష్ రావు ఇద్దరు రెండు బ్యారేజ్ లపై మాట్లాడుతారు. ప్రాజెక్టు కుంగడం.. ఇదేం కొత్తది కాదు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ హితవు పలికారు.
‘‘డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టు కుంగిన దగ్గర సోయిల్ టెస్ట్ చేశారా?. కనీసం కింద దిగకుండా పై పైన చూసి పోవటం కాదు. దీన్ని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడటం సరికాదు. మార్చి 1 తర్వాత నీళ్ళు ఇచ్చే పరిస్తితి లేదు. సెన్స్ మాకు లేదు అంటున్నారు.. ఉండి మీరు నీళ్లు వృధాగా పోతుంటే మీరేం చేస్తున్నారు?. అందర్నీ తికమక పెడుతున్నారు.
.. మొన్న ప్రభుత్వానికి ఇచ్చింది రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ మాత్రమే. మేం డ్యాం సందర్శనకు వెళ్తున్నామని.. వాళ్లు వెళ్తామంటున్నారు. సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఈ పోటీ యాత్రలు మానుకోవాలి. మమ్మల్ని బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికైనా ఒక పంప్ ఆన్ చేసి నీళ్ళు వదలండి. కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డికి బరాబర్ చూసి రండి. ఏనుగు వెళ్తే, ఎలుక చిక్కినట్టు ఉంది. ఉద్దండ పూర్ కట్టిందే కేసీఆర్. కేసీఆర్ ను బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. రాజకీయం కోసం కేసిఆర్ మీద, గత ప్రభుత్వ పెద్దల మీద కేసులు పెట్టేలా చూస్తున్నారు.
.. కోర్టులు ఉన్నాయి, దైర్యంగా ఎదుర్కొంటాం. బ్యారేజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. నీళ్ళు లీక్ అయ్యే దగ్గర కాపర్ డ్యాం ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వొచ్చు. వెదిరే శ్రీరామ్ తెలివి తక్కువ వాడు, ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. అందుకే ఈ విమర్శలు. కాళేశ్వరంకు 400 అనుమతులు ఉన్నాయి.
.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కానీ, బీజేపీ కింద పని చెసే సంస్థల పట్ల ప్రేమ ఎందుకు?. కాంగ్రెస్ నాయకులు రిజర్వాయర్ కు బరాజ్ కు తేడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది..
‘‘మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దాం. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా. సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్ పోటీ చేయాలి. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment