హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతినంతా బయటపెట్టి.. ఆ పార్టీ నేతలు తిన్నదంతా కక్కించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. బుధవారం ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్ ‘ప్రజా పాలన’ విడుదల సందర్భంగా.. గత ప్రభుత్వ మంత్రులపై సంచలన వ్యాఖ్యలే చేశారాయన.
‘‘ఎన్నికల సమయంలో చెప్పినట్లే గడిల పాలనను ప్రజల దగ్గరకు తెస్తున్నాం. ప్రజావాణితో సమస్యలు పరిష్కారం అవట్లేదని కేటీఆర్ అంటున్నారు. తన దగ్గరున్న రూ.లక్ష కోట్లలో.. కేటీఆర్ సాయం చేసింది రూ. లక్షే. ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లే. మిగిలినవి కూడా కేటీఆర్‌తో ఇప్పిస్తాం. ప్రజలకు ఆ రూ.లక్ష కోట్లు పంపిస్తాం’’ అని సీఎం రేవంత్ అన్నారు.
..అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావుతో ఆ పార్టీ నేతలెవరూ కలిసి రాలేదు. బావ, బావమరిది తాపత్రయం తప్ప సభలో ఎవరైనా మాట్లాడుతున్నారా?. సభలో చెప్పకోలేనివి ఇంటి దగ్గర మాట్లాడుకుంటున్నారు. వాళ్లు తింటున్నది రక్తపు కూడు. ప్రజల రక్త మాంసాలతో లక్ష కోట్లు సంపాదించారు. కార్లే కొనలేదని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూసర్‌లు కొని విజయవాడలో పెట్టారు. ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తెప్పిద్దాం అనుకున్నారు. కానీ, వాళ్ల నెత్తిన దరిద్రం కూర్చుని.. ఆ క్రూసర్ కార్లు మాకు వచ్చాయి.
..బుల్లెట్ రైలు గురించి మాట్లాడే వినోద్.. వరంగల్ నుంచి సైనిక్ స్కూల్ ఎందుకు రతలిపోయిందో చెప్పాలి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారంపై విచారణ చేయిస్తున్నాం. ముందుంది ముసళ్ల పండుగ.. అన్నీ వసూలు చేస్తాం’’ అని సీఎం రేవంత్ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment