సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డే బొందపెడతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లోనూ మోదీ ఆశీస్సులు ఉండాలని రేవంత్ అనడంలో అర్థమేంటి?. మళ్లీ మోదీనే ప్రధాని అని రేవంత్ ఒప్పుకున్నారా?’’ అంటూ ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రధాని మోదీకి ఎంత గౌరవం ఇచ్చామో అందరికి తెలుసు. మనకు ఏం చేయలేదనే 2021 నుంచి మోదీ తెలంగాణకు వచ్చినపుడు కేసీఆర్ వెళ్లలేదు. మోదీనీ బుట్టలో వేసుకోవడానికి కొన్ని మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాలుగు నెలల క్రితం గుజరాత్‌ను కించపరిచిన రేవంత్.. నిన్న మోదీ ముందు దేశానికి గుజరాత్ మోడల్ అన్నారు. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేలాగా మారి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘‘ఎర్రటి ఎండలో కూడా కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌లో వంద భాగాలు ఉన్నాయి, మూడు బ్యారేజీలు ఉన్నాయి. 270 పైగా సొరంగ మార్గాలు ఉన్నాయి. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని ఆపాలని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రయత్నం చేయడంలేదు’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు
Comments
Please login to add a commentAdd a comment