ఇరిగేషన్ కార్యాలయాల తరలింపును సహించేది లేదు
ఇరిగేషన్ కార్యాలయాల తరలింపును సహించేది లేదు
Published Thu, May 18 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే
ఇరిగేషన్ కార్యాలయాల స్థలాల కబ్జాకే తరలింపు డ్రామా
వైఎస్సార్ సీపీ కేంద్ర సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ
ధవళేశ్వరం: ఇరిగేషన్ కార్యాలయాలను ధవళేశ్వరం నుంచి తరలించాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ స్పష్టం చేశారు. ఆమె గురువారం వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలిసి ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈ బి.రాంబాబును కలిశారు. ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాలు ఇక్కడ ఉండటం వల్ల కలిగే లాభాలను, వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలపాలని జక్కంపూడి విజయలక్షి ్మ ఎస్‌ఈ రాంబాబును కోరారు. ఒక ప్రక్క ఉద్యోగులకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని జీవోపై పూర్తి సమీక్ష వరకు తరలించబోమని హామి ఇచ్చినప్పటికీ తరలింపులో అధికారుల అత్యుత్సాహం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాల స్థలాలను కబ్జా చేసేందుకే 29 ఏళ్ళ క్రితం వచ్చిన జీఓను తెరమీదకు తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. ఒక పక్క ఈస్ట్రన్ డివిజన్‌కు ధవళేశ్వరంలో కార్యాలయం కడుతుండగా తరలింపు ప్రక్రియ ఏమిటని ప్రశ్నించారు.సెంట్రల్ డివిజన్ కార్యాలయ మరమ్మతులకు కూడా నిధులు విడుదల కాగా అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చాలని ప్రయత్నించడం ఏమిటని ఎస్‌ఈని ప్రశ్నించారు. సెంట్రల్ డివిజన్‌లో ఉన్న మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలను పెద్దాపురం డివిజన్‌లో కలిపేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. రైతులు,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే విధంగా కార్యాలయాలను తరలించాలని చూస్తే వేలాది మంది రైతులతో ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. రైతుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు అయినా తాను సిద్ధమేనని జక్కంపూడి విజయలక్ష్మీ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కనీసం ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాల తరలింపునకు ప్రయత్నించారంటే అధికారుల అత్యుత్సాహం తెలుస్తోందన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళకు తలొగ్గకుండా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాధనాల చంద్రశేఖర్ (శివ), వైఎస్సార్ సీపీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఆకుల రాజా, షట్టర్ బాషా, మిరప రమేష్, గపూర్, ముత్యాల జాన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement