కృష్ణా జలాల వినియోగంపై తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. ఇరు రాష్ట్రాల నీటి అవసరాలను తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం కీలక భేటీ నిర్వహించనుంది. ఇందులో రెండు రాష్ట్రా లు తమ నీటి అవసరాలపై సమర్పిం చిన ఇండెంట్‌లతోపాటు మైనర్ ఇరిగేషన్ కింద నీటి లెక్కలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో 103 టీఎంసీలు కేటారుుంచాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ 47 టీఎంసీల మేర కోరుతోంది. ఇప్పటివరకు వచ్చిన నీటిలో ఎక్కువగా ఏపీ వినియోగించిందని తెలంగాణ చెబుతుండగా, తెలంగాణయే అధికంగా వాడిందని ఏపీ పేర్కొంటోంది.