రబీకి సాగునీరు లేనట్లే
Published Thu, Dec 15 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
నంద్యాల: రబీ సీజన్‌కు సాగునీరు అందించే అవకాశం లేదని తెలుగుగంగ సూపరింటెండింగ్ ఇంజినీర్ రాఘవరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్‌లో నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడపకు తెలుగుగంగ ద్వారా 14టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 12టీఎంసీలు నీరు విడుదల చేశారు. ఇక రెండు టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. ఈ నీటిని విడుదల చేశాక మిగిలిన రెండు టీఎంసీల నీటిని వేసవిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, వెలుగోడు మున్సిపాలిటీల తాగునీటికి వినియోగించాల్సి వస్తుంది. దీంతో రబీ సీజన్‌లో సాగునీటిని అందించే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు.
Advertisement