సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం సాగునీటి, ఆర్ అండ్ బీ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల సాగునీటికి సంబంధించి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. భవిష్యత్‌లో గోదావరి కృష్ణా జలాల వినియోగంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం నీటి పారుదలశాఖ, ఎల్లుండి ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమీక్షా సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక సాగునీటి రంగానికి ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం జరిగే సమావేశంలో కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణంకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం క్యాబినెట్ ఆమోదించిన తర్వాత డిజైన్లపై అధికారిక ప్రకటన చేస్తారు. (సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్)
కాగా తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. (సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!)
Comments
Please login to add a commentAdd a comment