building demolition
-
సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చేస్తున్న GHMC అధికారులు
-
ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత
దుండిగల్: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్(ఐఏఆర్ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పనులను అడ్డగించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేయడంతో పాటు పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తరువాత మరో సారి కూల్చివేతలు కొనసాగించగా కళాశాల యాజమాన్యం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూల్చివేతలను నిలిపివేశారు. కళాశాలకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐఏఆర్ఈ కళాశాలలో కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల చైర్మన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కళాశాలకు వచ్చి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. 20 రోజుల్లోపే చర్యలు.. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును ఫిబ్రవరి 20వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్వయంగా పరిశీలించారు. సుమారు 8.24 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారు లు అప్పట్లోనే ఆయనకు నివేదిక ఇచ్చారు. అదే నెల 22వ తేదీన ఎఫ్టీఎల్ సరిహద్దులను ఏర్పాటు చేసి షెడ్డులు, ఇతర నిర్మాణాలను తొలగించారు. తాజాగా ఐదు అంతస్తుల శాశ్వత భవనంలో రెండు అంతస్తుల మేర కొంత భాగాన్ని కూల్చారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నా...ఆగలేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి 25 సంవత్సరాల నుంచి కళాశాలను నడిపిస్తున్నాం. అప్పటి నుంచి ఏ ఒక్క అధికారి కూడా నోటీసు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అనుమతులు తీసుకున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చిన తరువాత రెగ్యులరైజేషన్ చేసుకోవాలని సూచించడంతో 2015లోనే రెగ్యులరైజ్ కోసం రూ.90 లక్షలు చెల్లించాం. కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. ఇది మా పట్టా భూమి. మేము కొనుగోలు చేశాం. చిన్న చిన్న డీవియేషన్లు ఉంటే రెగ్యులరైజ్ చేసుకుంటాం. వారం క్రితం నోటీసు ఇచ్చారు.. కోర్టు ద్వారా సమాధానం ఇస్తామని చెప్పినా కనీసం సమయం కూడా ఇవ్వలేదు. -
డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిలిచిపోయింది. ఈ నెల 19వ తేదీన ఆరు అంతస్తుల ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం విదితమే. అదే రోజు డెక్కన్ నిట్‌వేర్‌లో పనిచేసే జునైద్, జహీర్, వాసిం భవనంలోకి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులుగా పాటు ఫైర్, డీఆర్ఎఫ్, పోలీసులు భవనం మొత్తం జల్లెడ పట్టి గాలించారు. ఈ నెల 21వ తేదీన భవనంలోని మొదటి అంతస్తులో ఒకరి మృతదేహం ఆనవాళ్లు మాత్రమే బయటపడ్డాయి. ఆదివారం కూడా అధికారులు గల్లంతైన వారి కోసం భవనం మొత్తం గాలించారు. కానీ ఎవరి ఆచూకీ లభించడలేదు. ► భవనం వెనుక వైపు గ్రౌండ్ నుంచి మూడో అంతస్తు వరకు శ్లాబులు కూలిపోయి శిథిలాలు మొత్తం మొదటి సెల్లార్లో పడ్డాయి. వాటి కిందే మృతదేహాలు ఉంటాయనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద శిథిలాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. జేసీబీ లాంటి యంత్రాలను తీసుకుని వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో సోమవారం కూడా అధికారులు భవనం లోపలికి వెళ్లలేదు. ► భవనం లోపల సెర్చ్ ఆపరేషన్ చేసేందుకు ఫైర్, పోలీసు అధికారులు భయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కానీ గల్లంతైన వారి బంధువులు మాత్రం తమవారి ఆచూకీ తెలిసేంత వరకు భవనం కూలి్చవేయవద్దని అంటున్నారు. దీంతో అధికారులు సందిగ్ధావస్థలో పడ్డారు. ► ఆచూకీ దొరకని జునైద్, వాసీం, జహీర్‌ల బంధువులను సోమవారం రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్‌రావు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారి రక్త నమూనాల కోసం వివరాలు సేకరించి వారిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఇటీవల దొరికిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. చదవండి: స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు -
వంగిపోయిన మరో భవనం.. కూల్చివేసిన అధికారులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో మరో భవనాన్ని బుధవారం అధికారులు కూల్చివేశారు. గత రాత్రి మూడంతస్తుల అపార్టుమెంట్ భవనం కూలిపోయేటట్టు పాక్షికంగా ఒరిగి ఉండటం స్థానికులు గుర్తించారు. భవనం పరిస్థితిని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పశ్చిమ బెంగళూరులోని కమలానగర్ ఉన్న భవనాన్ని అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమక్షంలో పోలీసుల జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ భవనానికి సమీప ఇళ్లలోని వారిని మరోచోటుకి తరలించారు. ఆ కుటుంబాలకు ఆహారవసతి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే భవనం కూలిపోయే స్థితికి రావడాని భారీ వర్షాలు కారణమని అధికారులు తెలిపారు. తాము కూల్చివేయాలని అనుకుంటున్న 26 భవనాల్లో ఇది ఒకటని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. గత గురువారం కూడా కస్తూరి నగర్లో ఓ మూడు అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. #WATCH | Karnataka: Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) demolished building in Vrushabhavathi ward near Shankar Nag bus stand in Bengaluru, earlier today. pic.twitter.com/bTk8dRKuli — ANI (@ANI) October 13, 2021 -
చూస్తుండగానే కుప్పకూలింది.. పెద్ద గండం తప్పింది
లక్నో: లక్నోలో మాజీ ఎంపీ దావూద్ అహ్మద్ ఐదంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్షణాల్లో కూలిపోయిన ఆ బిల్డింగ్ కింద ఎవరు లేకపోవడంతో పెద్ద గండం తప్పినట్లయింది. లక్నోలోని రెసిడెన్సీ సురక్షిత స్థలానికి అడ్డుగా ఉందంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) అభ్యంతరం తెలపడంతో బిల్డింగ్‌ను కూలగొట్టారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన చాలా భవనాల వారసత్వ సంపదను దెబ్బతీస్తుందని అక్కడి స్థానికలు ఇటీవలే కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టుకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో బిల్డింగ్‌ను కూల్చివేశారు. కాగా పెద్ద పెద్ద బుల్డోజర్లు తెచ్చి బిల్డింగ్‌ను కూల్చే ప్రయత్నం చేశారు. క్షణాల్లోనే బిల్డింగ్ కూలిపోగా.. మట్టిపెళ్లలు వచ్చి క్రేన్ ఆపరేటర్‌కు తగిలాయి. అయితే అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా అక్కడ ఉన్న వాహనాల్లో చాలా వరకు ధ్వంసం అయ్యాయి. ''బిల్డింగ్ కూల్చడం బాగానే ఉంది.. కానీ పెద్ద గండం తప్పింది..'' అని నెటిజన్లు కామెంట్ చేశారు. बी एस पी के पूर्व एम पी दाऊद का लखनऊ में बन रहा मल्टी स्टोरीड रेजिडेंशियल अपार्टमेंट सरकार ने ज़मींदोज़ कर दिया।इसकी लागत 100 करोड़ बताई जा रही है।यह ए एस आई के मोन्यूमेंट रेजीडेंसी के बहुत क़रीब बन रहा था।जिसने इसे गिराने का आदेश दिया था। pic.twitter.com/Uozb1klqW2 — Kamal khan (@kamalkhan_NDTV) July 4, 2021 -
‘క్వీన్’ ఆఫీస్‌లో కూల్చివేతలు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ(ముంబై మున్సిపాలిటీ) అధికారులు బుధవారం కూల్చివేతకు దిగారు. ఈ ఘటనపై కంగన తీవ్రంగా మండిపడ్డారు. నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌నుద్దేశించి సంభోదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఉద్ధవ్‌ఠాక్రే, నువ్వేమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో జతకట్టి నా ఇల్లు కూల్చడం ద్వారా కక్ష తీర్చుకున్నటు భావిస్తున్నావు! కానీ గుర్తుంచుకో, కాలచక్రం ఎవరికోసం ఆగదు, ఈ రోజు నా ఇల్లు కూల్చారు, రేపు నీ అహంకారం కుప్పకూలుతుంది!’ అని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. 2017లో కంగన ఈ బిల్డింగ్‌ను రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. కంగన బిల్డింగ్‌లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. బీఎంసీ దురుద్దేశంతో చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ఆరంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని బీఎంసీని కోర్టు ప్రశ్నించింది. తన బిల్డింగ్‌లో చేపట్టిన కూల్చివేతలను నిలిపివేయాలన్న కంగన పిటీషన్‌ను విచారించిన కోర్టు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేసింది. కంగన, శివసేన వివాదం క్రమంగా బీజేపీ వర్సెస్ శివసేన వివాదంగా రూపుదిద్దుకుంటోంది. కంగన కార్యాలయంలో కొన్ని నిర్మాణాల కూల్చివేతపై బీజేపీ స్పందిస్తూ శివసేన కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శించింది. ముంబైకి కంగన హిమాచల్ ప్రదేశ్ నుంచి కంగన బుధవారం ముంబైకి వచ్చారు. ఆమెరాకను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టు నుంచి బందోబస్తు నడుమ ఆమె ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆర్పీఐ(ఏ) కార్యకర్తలు, కర్ణిసేన కార్యకర్తలు కంగనకు మద్దతుగా గుమిగూడారు. ఇటీవలే కంగనకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది. కంగన బిల్డింగ్‌లో కూల్చివేతలను హిమాచల్ ముఖ్యమంత్రి ఖండించారు.కంగన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అలా మొదలైంది! బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేస్తున్న కంగనకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని గతంలో బీజేపీ నేత రామ్ కదమ్ కోరారు. దీనిపై కంగన స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్ చేశారు. ముంబై పోలీసులకు బదులుగా హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. పీఓకేలో పరిస్థితులు చూసివచ్చి మాట్లాడాలని కంగనకు సలహా ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ తాను 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని కంగన సవాల్ విసిరారు. తనపై చేసిన వ్యాఖ్యలకు సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సంజయ్ స్పందిస్తూ తానెప్పుడూ కంగనను బెదిరించలేదని, ముంబైని పీఓకేతో పోల్చడంపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. కంగన బిల్డింగ్‌లో నిర్మాణాల కూల్చివేతకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చండీగఢ్‌లో ఎయిర్‌పోర్టులో వై–ప్లస్ కేటగిరీ భద్రత మధ్య కంగనా -
కొత్త సచివాలయం డిజైన్‌పై ఎల్లుండి ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం సాగునీటి, ఆర్ అండ్ బీ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల సాగునీటికి సంబంధించి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. భవిష్యత్‌లో గోదావరి కృష్ణా జలాల వినియోగంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం నీటి పారుదలశాఖ, ఎల్లుండి ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక సాగునీటి రంగానికి ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం జరిగే సమావేశంలో కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణంకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం క్యాబినెట్ ఆమోదించిన తర్వాత డిజైన్లపై అధికారిక ప్రకటన చేస్తారు. (సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్) కాగా తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. (సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!) -
మరోసారి భవనాన్ని పరిశీలించాల్సిందే!
సాక్షి, తూర్పుగోదావరి: పిల్లర్లు విరిగి ఒకవైపుకు ఒరిగిన భాస్కర ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌ను పరిశీలించేందుకు హైదరాబాద్ నిపుణుల బృందం సోమవారం కాకినాడకు చేరుకుంది. ఇంజనీర్లు భవన కాలమ్స్, సెంటర్ భీమ్‌లను రీబౌండ్ హ్యామర్, కాంక్రీట్ టెస్టర్లతో పరిశీలించారు. పిల్లర్ల వద్ద ఎక్కువ దెబ్బతిన్న భవనాన్ని రిట్రో ఫిట్టింగ్ చేసి పటిష్టం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా పిల్లర్ల పై ఉన్న సిమెంట్ ప్లాస్టరింగ్ తొలగించి మరోసారి భవనాన్ని పరిశీలించనున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దంతో భవనం కింది భాగంలో పగుళ్లు తీశాయి. తర్వాతి రోజు ఉదయం చూసేసరికి నాలుగు పిల్లర్లకు సంబంధించి ముందు, వెనుక భాగంలో ఉన్న ఫ్లాట్ల పైభాగంలో, గదుల్లోను నెర్రలు తీసి పెచ్చులూడి పడడంతో నిర్వాసితులు భయాందోళన చెందారు. దీంతో బహుళ అంతస్తులో నివసించే 39 కుటుంబాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. గత శుక్రవారం జేఎన్టీయూ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల బృందం భవనాన్ని పరిశీలించి కూల్చివేయాలని అభిప్రాయపడింది. (చదవండి: ఆ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయడమే కరెక్ట్!) -
ఆ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయడమే కరెక్ట్!
సాక్షి, కాకినాడ: కాకినాడలో పూర్తిగా ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్ అపార్ట్మెంట్ భవనాన్ని జేఎన్టీయూ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల బృందం శుక్రవారం పరిశీలించింది. ఎనిమిది మంది అధ్యాపకులతో కూడిన బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి మూడు పిల్లర్లు పూర్తిగా పాడైపోయాయని తెలిపింది. రెండు వారాల్లో అపార్ట్మెంట్లో నివసిస్తున్న అందరినీ ఖాళీ చేయించి భవనాన్ని కూల్చివేయాలని పేర్కొంది. ఒకవేళ రిట్రో ఫిట్టింగ్ టెక్నాలజీతో అపార్ట్‌మెంట్‌ను ఉంచాలనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని తెలిపింది. అందుకు ముంబై నుంచి అనుభవజ్ఞుల బృందం వచ్చి పరిశీలించి అనుకూలం అని చెప్తేనే రిట్రో ఫిట్టింగ్ చేసుకోవచ్చు అని సూచించింది. ఇక భవన నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడారని, అలాగే స్టీల్ కూడా తుప్పు పట్టిందని గుర్తించారు. భయం భయం... బహుళ అంతస్తు భవనం పక్కకు ఒరిగి ప్రమాదభరితంగా మారగా అపార్టుమెంటువాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆగమేఘాలపై 39 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. భాస్కర ఎస్టేట్ పేరుతో 13 ఏళ్ల క్రితం 60 పిల్లర్లతో రెండు భాగాలుగా విభజించి ఒక భాగంలో 20 ఫ్లాట్లు, మరో భాగంలో 20 ఫ్లాట్లు కలిపి మొత్తం 40 ఫ్లాట్లతో కూడిన భవనాన్ని నిర్మించారు. భవనానికి కింది భాగంలో మొత్తం షెల్టర్‌గా ఉంచారు. ఈ భాగంలో నాలుగు పిల్లర్లు బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దంతో పగుళ్లు తీశాయి. ఈ విషయాన్ని అపార్టుమెంట్‌వాసులు గమనించలేదు. ఉదయం చూసేసరికి నాలుగు పిల్లర్లలో మూడు పిల్లర్లు కిందిభాగంలో సిమెంట్ అచ్చుఅచ్చులుగా రాలిపోవడం గమనించారు. ఒక పిల్లరు పగులు తీసింది. ఇది మామూలేగానే జరుగుతున్న విషయంగా ఫ్లాట్ల యజమానులు వదిలేశారు. అయితే ఈ నాలుగు పిల్లర్లకు సంబంధించి ముందు, వెనుక భాగంలో ఉన్న ఫ్లాట్ల పైభాగంలో, గదుల్లోను నెర్రలు తీసి పెచ్చులూడి పడడంతో నిర్వాసితులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న మిగిలిన ఫ్లాట్ల యజమానులకు ఈ విషయాన్ని చెప్పడంతో కొందరు మా ఫ్లాట్లు కూడా పగుళ్లు తీస్తున్నాయంటూ భయాందోళన వ్యక్తం చేశారు. విషయాన్ని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణకు, త్రీటౌన్ పోలీసులకు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో సమాచారం అందించారు. దీంతో అధికార యంత్రాంగం సంఘటన స్థలాన్ని పరిశీలించి, తక్షణం భవనాన్ని ఖాళీ చేయాలని 39 కుటుంబాలను ఆదేశించారు. భవనం నాణ్యత ప్రశ్నార్థకంగా ఉందని, దీనిపై ఇంజినీరింగ్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు పరిశీలన చేసేంత వరకు ఈ ఫ్లాట్లలో ఏ ఒక్కరూ నివసించడానికి వీల్లేదంటూ అధికారులు హుటాహుటిన ఆ అపార్టుమెంట్లో ఉన్న కుటుంబాలను ఖాళీ చేయించారు. భాస్కర్ ఎస్టేట్ అపార్టుమెంట్ ఏ క్షణంలోనైనా కూలవచ్చని, ఇందులో ప్రజలు నివసించడం మంచిది కాదని అధికారులు చెబుతున్నారు. ఈ భవనం పిల్లర్లు పగుళ్లు తీయడం, కుంగడం వంటి విషయాలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేశాకే ఈ భవనాన్ని ఉంచాలా? కూల్చివేయాలా? అనే విషయాన్ని నిర్ధారిస్తామని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ విలేకర్లకు తెలిపారు. ప్రస్తుతం ఈ భవనంలో కుటుంబాలు నివసించడం అంత క్షేమం కాదన్నారు. ఆర్డీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ కె.రమేష్ , డీఎస్పీ కె.కుమార్ తమ, తమ సిబ్బందితో వచ్చి భవనాన్ని పరిశీలించారు. శాలిపేట అగ్నిమాపక అధికారి ఎం.రాజా తమ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. -
సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ పాత భవనాలను కంట్రోల్ బ్లాస్టింగ్ పద్ధతిలో పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త భవన సముదాయానికి డిజైన్లు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో వాటిని ఖరారు చేసి నిర్మాణానికి వీలుగా టెండర్లు ఖరారు చేయబోతున్నారు. శ్రావణ మాసంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో కొత్త భవనాల సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పాత భవనాలను కూల్చివేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను కూడా శ్రావణ మాసంలోనే మొదలుపెట్టాలని భావిస్తున్నారు. 15 రోజుల్లో కార్యాలయాల తరలింపు... ప్రస్తుతం సచివాలయంలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలున్నాయి. ఒక్కో భవనం ఒక్కో బ్లాకుగా మొత్తం పది భవనాలున్నాయి. ఇందులో జీ బ్లాకుగా ఉన్న నిజాం హయాంలో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ అన్నింటికంటే పురాతనమైంది కాగా, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాలున్న డి బ్లాక్ భవనం కొత్తది. మిగతావి ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి తదితరులు ముఖ్యమంత్రులుగా ఉండగా నిర్మించినవి. ఇప్పుడు ఈ భవనాలన్నింటినీ కూల్చివేయనున్నారు. తొలుత ఎ, బి, సి, డి బ్లాకుల్లోని కార్యాలయాలను హెచ్, జే, కే బ్లాకుల్లోకి తరలించి వాటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. కానీ అదే ప్రాంగణంలో కార్యాలయాలుంటే, కూల్చివేతల సమయంలో దుమ్ము ధూళితో ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించారు. దీంతో వేరే చోటకు కార్యాలయాలను తరలించి మొత్తం భవనాలన్నింటినీ ఒకేసారి కూల్చి కొత్త భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా బీఆర్కే భవన్‌ను ఎంపిక చేసి అందులోని కార్యాలయాలను ఖాళీ చేయించారు. వచ్చే పక్షం రోజుల్లో సచివాలయ కార్యాలయాలు అందులోకి తరలిపోనున్నాయి. పాత విధానంలో దుమ్ము ధూళి సమస్య... సచివాలయం మొత్తం ఖాళీ కాగానే ఆ భవనాల కూల్చివేతలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. పది బ్లాకులుగా పెద్దపెద్ద భవనాలున్నందున వాటిని సంప్రదాయ పద్ధతిలో కూల్చివేయటానికి చాలా సమయం పడుతుండటమే కాకుండా, పనులు జరుగుతున్నన్ని రోజులు దుమ్ము ధూళి సమీప ప్రాంతాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున ఆధునిక పద్ధతిలో కూల్చివేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పేలుడు పదార్థాలు అమర్చి ఒకేసారి భవనం మొత్తాన్ని నేలకూల్చే బ్లాస్టింగ్‌ను ఎంచుకోనున్నట్టు సమాచారం. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే అన్ని బ్లాకులను కూల్చివేసి శిథిలాలను తరలించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణులను పిలిపించి చర్చించనున్నారు. ఈ విధానం హైదరాబాద్‌లో పెద్దగా చేపట్టిన దాఖలాలు లేవు. గతంలో మూడునాలుగు పర్యాయాలు కొన్ని భవనాలను కూల్చారు. అయితే, వాటిలో కొన్ని పూర్తిగా విజయవంతం కాలేదు. దీంతో ఈ విధానంలో నైపుణ్యం ఉన్నవారికే ఈ బాధ్యత అప్పగించాలని యోచిస్తున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
టీడీపీ నేత కంభంపాటి అక్రమకట్టడం కూల్చివేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మెహనరావు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమంగా కట్టిన కట్టడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు. రామ్మోహనరావు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన తన ఇంటికి ముందు భాగంలో రోడ్డుమీద అక్రమంగా నిర్మాణం చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయమే ఆ కట్టడాన్ని కూల్చేశారు. ఇటీవలి కాలంలో అక్రమ కట్టడాల విషయంలో జీహెచ్ఎంసీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. కూకట్ పల్లి, పాతబస్తీ తదితర ప్రాంతాలలో తమకు ఫిర్యాదులు రాగానే వెంటనే చర్యలు తీసుకుంటోంది. గత వారం 15 రోజులుగా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తమపై వచ్చే రాజకీయ ఒత్తిళ్లను కూడా పక్కనపెట్టి కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమం కాదు.. నేనే కూల్చేశా: కంభంపాటి కాగా, అది అక్రమ నిర్మాణం కాదని.. ఇంటి బయట వాచ్ మన్ నివాసం కోసం చిన్న గదిలాంటిది కట్టిస్తుండగా జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. దాంతో తానే మనుషులను పెట్టి దాన్ని కూల్చేసినట్లు ఆయన చెప్పారు.