
సాక్షి, తూర్పుగోదావరి: పిల్లర్లు విరిగి ఒకవైపుకు ఒరిగిన భాస్కర ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌ను పరిశీలించేందుకు హైదరాబాద్ నిపుణుల బృందం సోమవారం కాకినాడకు చేరుకుంది. ఇంజనీర్లు భవన కాలమ్స్, సెంటర్ భీమ్‌లను రీబౌండ్ హ్యామర్, కాంక్రీట్ టెస్టర్లతో పరిశీలించారు. పిల్లర్ల వద్ద ఎక్కువ దెబ్బతిన్న భవనాన్ని రిట్రో ఫిట్టింగ్ చేసి పటిష్టం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా పిల్లర్ల పై ఉన్న సిమెంట్ ప్లాస్టరింగ్ తొలగించి మరోసారి భవనాన్ని పరిశీలించనున్నారు.
సెప్టెంబర్ 18వ తేదీన అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దంతో భవనం కింది భాగంలో పగుళ్లు తీశాయి. తర్వాతి రోజు ఉదయం చూసేసరికి నాలుగు పిల్లర్లకు సంబంధించి ముందు, వెనుక భాగంలో ఉన్న ఫ్లాట్ల పైభాగంలో, గదుల్లోను నెర్రలు తీసి పెచ్చులూడి పడడంతో నిర్వాసితులు భయాందోళన చెందారు. దీంతో బహుళ అంతస్తులో నివసించే 39 కుటుంబాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. గత శుక్రవారం జేఎన్టీయూ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌ల బృందం భవనాన్ని పరిశీలించి కూల్చివేయాలని అభిప్రాయపడింది. (చదవండి: ఆ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయడమే కరెక్ట్!)
Comments
Please login to add a commentAdd a comment