సాక్షి, బెంగళూరు: బెంగళూరులో మరో భవనాన్ని బుధవారం అధికారులు కూల్చివేశారు. గత రాత్రి మూడంతస్తుల అపార్టుమెంట్ భవనం కూలిపోయేటట్టు పాక్షికంగా ఒరిగి ఉండటం స్థానికులు గుర్తించారు. భవనం పరిస్థితిని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పశ్చిమ బెంగళూరులోని కమలానగర్ ఉన్న భవనాన్ని అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమక్షంలో పోలీసుల జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ భవనానికి సమీప ఇళ్లలోని వారిని మరోచోటుకి తరలించారు.
ఆ కుటుంబాలకు ఆహారవసతి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే భవనం కూలిపోయే స్థితికి రావడాని భారీ వర్షాలు కారణమని అధికారులు తెలిపారు. తాము కూల్చివేయాలని అనుకుంటున్న 26 భవనాల్లో ఇది ఒకటని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. గత గురువారం కూడా కస్తూరి నగర్‌లో ఓ మూడు అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.
#WATCH | Karnataka: Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) demolished building in Vrushabhavathi ward near Shankar Nag bus stand in Bengaluru, earlier today. pic.twitter.com/bTk8dRKuli
— ANI (@ANI) October 13, 2021
Comments
Please login to add a commentAdd a comment