మహానేతను నిందించడానికే అసెంబ్లీ సమావేశాలు..
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని, మహానేత కుటుంబాన్ని నిందించడానికే అసెంబ్లీ సమావేశాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెట్టుకున్నట్టు ఉందని వైఎస్ఆర్ సీపీ నేత భూమానాగిరెడ్డి విమర్శించారు.
ఊహాతీత బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలపై రుద్దడం నీచ రాజకీయాలకు నిదర్శనమని భూమా అన్నారు. నంద్యాల మున్సిపల్ కమిటీ సమావేశాన్ని భూమానాగిరెడ్డి నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా కౌన్సిలర్ అనూషను భూమానాగిరెడ్డి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.