మా బలాన్ని కబ్జా చేయాలనే.. | tdp wants to grab our strength, says bhooma nagireddy | Sakshi
Sakshi News home page

మా బలాన్ని కబ్జా చేయాలనే..

Published Fri, Feb 19 2016 6:14 PM | Last Updated on Sat, Aug 11 2018 3:37 PM

మా బలాన్ని కబ్జా చేయాలనే.. - Sakshi

మా బలాన్ని కబ్జా చేయాలనే..

కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ బలంగా ఉందన్న దుగ్ధతోనే తాము పార్టీ మారుతున్నట్లు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మండిపడ్డారు. జిల్లా నుంచి గెలిచినవాళ్లంతా మంచి క్యారెక్టర్, విజన్ ఉన్నవాళ్లని.. అందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీద అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చి, ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారని ఆయన చెప్పారు. తమ బలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతోనే ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నట్లుగా ఓ ప్రకటన ఇచ్చారని ఆయన అన్నారు.

ఎంతమంది ఆ పార్టీలోకి వెళ్లారో ఈవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసలు ఎన్నికల కౌంటింగ్ ముగిసి.. తాను గెలిచినట్లు తెలిసిన మరుక్షణం నుంచే తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేశారని భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రతిరోజూ రాస్తున్నారని... దాన్ని ఎన్నిసార్లు ఖండించాలని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement